ఉపాధి కరువై చెత్త ఏరుకుంటున్న చెంచు బిడ్డలు

by Anjali |
ఉపాధి కరువై చెత్త ఏరుకుంటున్న చెంచు బిడ్డలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఉపాధి కరువై నాగర్ కర్నూల్ చెంచు బిడ్డలు చెత్త ఏరుకునే పరిస్థితి ఏర్పడింది. కర్నూల్ కొల్లాపూర్ మండలం ఎల్లూరు చెంచుగూడెంకు చెందిన చెంచు ప్రజలు ఉపాధి కరువై ప్లాస్టిక్ డబ్బాలు, ఇనుప ముక్కలను సేకరించి అమ్ముకుంటున్నారు. వీటిని అమ్మడం ద్వారా వచ్చే డబ్బుతో జీవనం సాగిస్తున్నారు. ఒక్కో రోజు తిండి కూడా తినకుండా పస్తులు ఉంటున్నామని, తమకు ఉపాధి కల్పించాలని నాగర్ కర్నూల్ చెంచు ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇక ఇటీవల నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం మొలచింతపల్లి గ్రామంలో చెంచు మహిళా ఈశ్వరమ్మను అత్యంత క్రూరంగా హింసించిన విషయం తెలిసిందే. మహిళను వివస్త్రను చేసి కొట్టి పచ్చి మిరపకాయలు దంచి ఆమె కళ్లలో పెట్టారు. మర్మంగాల్లో పెట్టి దారుణంగా చిత్ర హింసలు పెట్టారు. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలపై అత్యాచార చట్టం 1989 అమల్లోకి వచ్చి 35 ఏళ్లు అయినప్పటికీ చెంచు ప్రజలపై అనేక నేరాలు జరుగుతున్నాయి. చెంచులు తమ భూములు కోల్పోయి నిరాశ్రయులుగా, నిరక్షరాస్యులుగా సరైన ఆధార్ గుర్తింపు లేక బతుకుతున్నారు. ఈ విధంగా చెంచు పెంటలకు రక్షణ కరువై దిక్కు తోచని పరిస్థితిలో చెంచు తెగ కొట్టుమిట్టాడుతోంది.

Advertisement

Next Story

Most Viewed