చంద్రయాన్ -3 శాస్త్రవేత్తల్లో నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల వాసి

by Kalyani |   ( Updated:2023-08-23 17:29:03.0  )
చంద్రయాన్ -3 శాస్త్రవేత్తల్లో నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల వాసి
X

దిశ, అచ్చంపేట : చందమామ రావే.. జాబిల్లి రావే.. కోటి పూలు తేవే... అని చిన్న పిల్లలకు పెద్దలు చంద్రుడిని చూపిస్తూ ఒకప్పుడు నాటి మాటలు. కానీ నేడు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రపంచం ఆశ్చర్య చెందేలా భారత్ ఖ్యాతిని మరింత పెచ్చి జయహో భారత్ అనుకున్న లక్ష్యానికి చంద్రునిపై చంద్రయాన్-3 విజయవంతమైన విషయం అందరికీ తెలిసిందే. ఆ ప్రయోగం సక్సెస్ లో పాలుపంచుకున్న ఎందరో శాస్త్రవేత్తలలో ఒకరుగా నల్లమల ప్రాంతానికి చెందిన... నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండలం తుమ్మలపేట గ్రామానికి చెందిన డాక్టర్ లగిశెట్టి రవికుమార్ శాస్త్రవేత్త కూడా ఉండడం గర్వకారణం గా ఉందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇస్రో శాస్త్రవేత్తలు అందరికీ హృదయ పూర్వక శుభాభివందనలు తెలుపుతూ.. అచ్చంపేట నియోజకవర్గంలో పట్టణాలు గ్రామాలలో జాతీయ పతాకాన్ని పట్టుకొని బాణాసంచా పేల్చుతూ సంబురంగా జరుపుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed