కాంగ్రెస్ వైపు పేట బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ల చూపు..

by Disha Web Desk 4 |
కాంగ్రెస్ వైపు పేట బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ల చూపు..
X

దిశ, నారాయణపేట ప్రతినిధి : నారాయణపేట జిల్లా కేంద్రంలో ఒకప్పుడు బీజేపీ కంచుకోటగా ఉన్న మున్సిపాలిటీ.. అనూహ్య పరిణామాల కారణంగా గత రెండు పర్యాయాలు బీఆర్ఎస్ పార్టీ సొంతమయింది. కానీ ప్రస్తుతం వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో మున్సిపల్ పీఠం హస్తగతమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇందుకు కారణాలు ఏమిటని పరిశీలిస్తే మున్సిపల్ ఎన్నికల నాటికి మెజార్టీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం లేకపోలేదు.

కాంగ్రెస్ వైపు పేట బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ల చూపు...?

నారాయణపేట జిల్లా కేంద్రంలోని సుమారు నాలుగు వార్డుల బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు స్థానిక కాంగ్రెస్ పార్టీ శ్రేణులను, నియోజకవర్గస్థాయి నాయకున్ని సంప్రదించినట్లు తెలుస్తోంది. కానీ వీరికి చుక్కెదురై నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీలోకి ఆ కౌన్సిలర్లను రనివ్వకండి అని కాంగ్రెస్ కిందిస్థాయి శ్రేణులు నియోజకవర్గస్థాయి నాయకునికి అబ్జెక్షన్ చెప్పినట్లు సమాచారం. గత ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఆ కౌన్సిలర్లు పనిచేస్తే వారిని పార్టీలోకి చేర్పించుకోవడం ఏమిటని చెప్పినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా టిఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ మహిళా కౌన్సిలర్....తన భర్త తో పాటు నేడో రేపో బిజెపిలోకి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

డైలామో లో పడ్డ కౌన్సిలర్లు....

వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో తమ వార్డు పరిధిలో కౌన్సిలర్ బరిలో నిలవాలని ఆశించిన కౌన్సిలర్లకు నిరాశ ఎదురయింది. తమను కాంగ్రెస్ పార్టీలోకి రానివ్వకపోవడం తో వారు పూర్తిగా డైలామాలో పడ్డారు. తమ రాజకీయ భవిష్యత్తు ఎలా అని... మరి ఏ పార్టీకి వెళ్లాలనే ఆలోచనలో ముందుకు సాగుతున్నారు. సిట్టింగ్ కౌన్సిలర్ టికెట్ ఇస్తే పార్టీలోకి వస్తామని చెప్పడంతో వచ్చేది వద్దు... టికెట్ ఇచ్చేది లేదు అని సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది..

Next Story

Most Viewed