- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే అభ్యర్థి, కలెక్టర్ దంపతులు
దిశ, నారాయణపేట ప్రతినిధి : బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్.రాజేందర్ రెడ్డి కోయిలకొండ మండలం శెరి వెంకటాపూర్ గ్రామంలో పోలింగ్ బూత్ నెంబర్ 59 లో (సీరియల్ నెంబర్ 470) ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లా కేంద్రంలోని గ్రౌండ్ స్కూల్లో ( పోలింగ్ బూత్ నంబర్ 130) లో నారాయణపేట జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఇదిలా ఉండగా పోలింగ్ కేంద్రంలో బటన్ నొక్కి పక్కకు వచ్చిన తర్వాత ఈవీఎం మిషన్లో కుయ్యుమని సౌండ్ రావడంతో పలువరు ఓటర్లు కంగుతున్నారు. మేము వేసిన ఓటు పడిందా లేదా అని ? కాసేపటికి వీవీ వీవీ ప్యాట్ లో ఓటు ఎవరికి వేశామని గుర్తు రావడంతో శాంతించారు. అంతే కాకుండా పోలింగ్ కేంద్రానికి పలువురు కేవలం ఓటర్ స్లిప్ లతో రావడంతో ఏదేని గుర్తింపు కార్డు అడగడంతో వెనుదిరిగి వెళ్లి ఐడీ కార్డు తీసుకువచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు.