న్యాయవాదిపై పోలీసుల దాడికి నిరసనగా.. విధుల బహిష్కరణ

by Mahesh |
న్యాయవాదిపై పోలీసుల దాడికి నిరసనగా.. విధుల బహిష్కరణ
X

దిశ, లీగల్: మహబూబ్నగర్ జిల్లా న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో గురువారం న్యాయవాదులు అంతా కలిసి విధుల బహిష్కరణ కార్యక్రమం చేపట్టారు. సిటీ సివిల్ కోర్టు న్యాయవాది అబ్దుల్ హలీం పై మాదన్నపేట పోలీసులు విచక్షణ రహితంగా దాడి చేసినందుకు నిరసనగా శుక్రవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. విధి నిర్వహణలో భాగంగా మాదన్నపేట పోలీస్ స్టేషన్కు వెళ్లినటువంటి మహమ్మద్ అబ్దుల్ కలీం న్యాయవాదిపై పోలీసులు దూషించి, రోడ్డుపై కొట్టుకుంటూ తీసుకువెళ్లారు విచక్షణ కొట్టడం వల్ల అతను స్పృహ తప్పి పడిపోయాడు. ఈ సందర్భంగా న్యాయవాదుల సంఘం జిల్లా అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఎలాంటి జాడలు పునరావృతం అవుతున్నాయని అలా కాకుండా ఉండాలంటే న్యాయవాదులు అంత ఏకతాటిపై ఉండాలని పేర్కొన్నారు.

నిరవధిక న్యాయవాదుల పోరాట కార్యక్రమాలకు బార్ కౌన్సిల్ సభ్యులు ఎవరు కూడా సహకరించడం లేదని చెప్పారు. హక్కులు పరిష్కరించుకోవాలంటే ప్రతి ఒక్కరు కలిసికట్టుగా ముందుకు రావాలని చెప్పారు. దసరా పండుగ తర్వాత న్యాయవాదుల సమస్యలపై నిరవధిక పోరాట కార్యక్రమాలు ఉంటాయని ఆయన తెలియజేశారు. న్యాయవాదుల సమస్యల విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లే విధంగా ప్రయత్నం కొనసాగిస్తామని ఆయన అభిప్రాయపడ్డారు. శుక్రవారం కూడా విడుదల బహిష్కరణ కార్యక్రమంలో సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రామ్నాథ్ గౌడ్ న్యాయవాదుల సంఘం కార్యవర్గ సభ్యులు సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed