- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నారాయణపేటలో తీవ్ర ఉద్రిక్తత
దిశ, ప్రతినిధి నారాయణపేట: కొట్లాడి తెచ్చుకున్న ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ అన్నారు. టీఎస్ పీఎస్ సీ ప్రశ్నా పత్రం లీకేజి ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవడంతోపాటు మంత్రి కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ వివేకానంద మున్సిపల్ పార్క్ వద్ద శనివారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాటాడుతూ... సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురు కవిత లిక్కర్ స్కాం చేస్తే రాష్ట్ర మంత్రి, సీఎం కుమారుడు పేపర్ లీకేజి స్కాం చేశారన్నారు. ఎంతో కష్టపడి చదివినవారి భవిష్యత్తు ఏమిటని ప్రశ్నించారు.
పేపర్ లీకేజి వల్ల విద్యార్థులు నష్టపోయారని నష్ట పరిహారంగా రూ. 1 లక్ష చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టరేట్ ముట్టడికి యత్నించగా పోలీసులు పలువురు బీజేపీ, బీజే వైఎం నాయకులను అడ్డుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా మరికొంత మంది బీజేపీ నాయకులు చిన్న రఘు, కమలాపూర్ శ్రీనివాస్, అవుటి భరత్ లు పోలీస్ వలయాన్ని దాటి కలెక్టరేట్ లోకి వెళ్లి నిరసన చేశారు. నిరసన కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కొండా సత్య యాదవ్, రఘు రామయ్య గౌడ్, ప్రభాకర్ వర్ధన్, భాస్కర్, సుంకు ఉమేష్, టౌన్ బిల్డర్ వెంకట్ రాములు, ఉట్కూర్ భరత్, అప్పి రెడ్డి పల్లి రాము, మహబూబ్ అలీ, మహిపాల్ రెడ్డి, సత్య నారాయణ, సంజీవ గౌడ్, మని మోడీ తదితరులు పాల్గొన్నారు.