అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసే విధంగా బీజేపీ మేనిఫెస్టో : డీకే అరుణ

by Kalyani |
అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసే విధంగా బీజేపీ మేనిఫెస్టో : డీకే అరుణ
X

దిశ, గద్వాల : తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే దిశగా బీజేపీ పనిచేస్తుందని మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. శుక్రవారం డీకే బంగ్లా లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. శనివారం ఉదయం 10 గంటలకు గద్వాల మార్కెట్ యార్డ్ వెనుక మేళ్లచెరువు క్రాస్ రోడ్ లో జరిగే సకల జనుల విజయసంకల్ప బహిరంగ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రాష్ట్ర అధ్యక్షుడు, కిషన్ రెడ్డి లు వస్తున్నారని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసే విధంగా బీజేపీ మేనిఫెస్టో ఉంటుందన్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే దిశగా , పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తుందని అన్నారు.

నిరుపేద ప్రజలకు ఆర్థికంగా సమాన గౌరవాన్ని పెంపొందించే విధంగా విద్య వైద్యం, రైతులకు, మహిళలకు నిరుద్యోగులకు పెద్ద ఎత్తున మేలు చేకూరే విధంగా కార్యక్రమాలు తీసుకు వచ్చిందని అన్నారు. యువతకు ఉపాధి ప్రణాళిక బద్ధంగా భారతీయ జనతా పార్టీ విజయ లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారని అన్నారు. భారతీయ జనతా పార్టీ బీసీలకు బహుజనలకు ముఖ్యమంత్రి అవకాశం కల్పించిందని, గద్వాలలో ఎమ్మెల్యే అభ్యర్థిగా బీసీ నాయకుణ్ణి బలి గేర శివారెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రజలు భారతీయ జనతా పార్టీ అభిమానులు కార్యకర్తలు, విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి, రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షుడు అప్సర పాషా కార్యవర్గ సభ్యులు వెంకటాద్రి రెడ్డి, అయ్యప్ప రెడ్డి ,జిల్లా ఇన్చార్జి చందు పాటిల్ రాష్ట్ర స్పోక్ పర్సన్ వెంకట్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story