బండి సంజయ్ అరెస్ట్ ను నిరసిస్తూ రాస్తారోకో..

by Kalyani |
బండి సంజయ్ అరెస్ట్ ను నిరసిస్తూ రాస్తారోకో..
X

దిశ, ప్రతినిధి నారాయణపేట: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ నారాయణపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ నాయకులు బుధవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు పగడాకుల శ్రీనివాసులు మాట్లాడుతూ టీఎస్పీఎస్ లో జరుగుతున్న అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. బీజేపీ ఎదుగుదలను చూసి బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేక పోతున్నారని ఆరోపించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న కుంభకోణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని చెప్పారు. అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో సత్య యాదవ్, ప్రభాకర్ వర్ధన్, మహబూబ్ అలీ, సత్య రఘుపాల్, రఘు రామయ్య గౌడ్, నందు నామాజీ, లక్ష్మి శ్యాంసుందర్ గౌడ్, అప్పిరెడ్డిపల్లి రాము తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed