- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సీపీఆర్ పై ఆరోగ్య సిబ్బందికి అవగాహన..
దిశ, వీపనగండ్ల: డాక్టర్ హరినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి వీపనగండ్ల, చిన్నంబావి మండలాల ఆరోగ్య సిబ్బందికి శనివారం సీపీఆర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీపీఆర్ విధానంతో గుండె పోటు, గుండెకు సంబంధించిన వివిధ రకాల సమస్యలతో ప్రాణాపాయ సమయంలో ప్రథమ చికిత్స చేసి ఏ విధంగా మనిషిని రక్షించాలో మొదలగు విషయాలపై మండల కేంద్రంలోని రైతు వేదికలో అవగాహన కల్పించారు.
ఏదైనా ప్రమాదవశాత్తు ఒక వ్యక్తి స్పృహ కోల్పోయిన, పడిపోయినా, హార్ట్ ఎటాక్ వచ్చిన వెంటనే అటువంటి వ్యక్తికి పునర్జీవనం ఏ విధంగా చేయాలనే దానిపై డాక్టర్ హరినాథ్ రెడ్డి, డాక్టర్ వంశీకృష్ణలు వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పాండు నాయక్, ఎంపీడీఓ కథలప్ప, ఎస్ఐ రామన్ గౌడ్, మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు యత్తం కృష్ణయ్య, సర్పంచ్ నరసింహారెడ్డి, మండల వ్యవసాయ అధికారి డా కేశ్వర్ గౌడ్, వివిధ గ్రామాల ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్స్, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.