దారుణం.. వీధి కుక్కల దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు..

by Kalyani |
దారుణం.. వీధి కుక్కల దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు..
X

దిశ, అచ్చంపేట: రాష్ట్రంలో ఎక్కడో ఓ చోట వీధి కుక్కల దాడిలో చిన్నారులు మరణించడం, తీవ్ర గాయాలైన సంఘటనలు చూస్తూనే ఉన్నాం. అలాంటి సంఘటనే మరొకటి నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం బోల్గాట్ పల్లి గ్రామంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. బల్మూరు మండలం లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన దేవి, కుమార్ దంపతుల కుమారుడు అఖిల్(8). అఖిల్ అమ్మమ్మగారి ఊరు అయిన బోల్గాట్ పల్లిలో తాతయ్య శీలం ఎల్లయ్య వద్ద ఉంటున్నాడు.

కాగా అఖిల్ పై వీధి కుక్కలు దాడి చేయడంతో అఖిల్ తల పైభాగం, ఎడమ చెవి పైభాగం, అలాగే కుడికాలు తొడ భాగంలో తీవ్ర గాయాలైనాయి. ప్రస్తుతం అఖిల్ అచ్చంపేట ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సంబంధిత అధికారులు వెంటనే వీధి కుక్కలను నియంత్రించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement

Next Story