- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Atchampeta: వాగులో చిక్కుకున్న ఆదివాసీలు.. రెస్క్యూ ఆపరేషన్‌తో అందరూ సేఫ్
దిశ, అచ్చంపేట : గత మూడు రోజుల క్రితం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసిన నేపథ్యంలో ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఈ క్రమంలో దేవరకొండ అచ్చంపేట నియోజకవర్గాల సరిహద్దు ప్రాంతం డిండి మండలం గువ్వలోనిపల్లి గ్రామానికి చెందిన పదిమంది ఆదివాసి చెంచు గిరిజనులు గొర్రె కాపరులుగా గొర్రెల కాపరులుగా ఉంటున్నారు. గత రెండు రోజుల క్రితం ఒక్కసారిగా ఉదృతం కావడంతో ఎటు వెళ్లలేక దాదాపు 46 గంటల నుండి అప్పన్న హస్తం కోసం ఎదురుచూసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోమవారం పొద్దుపోయిన తర్వాత విషయం బయటికి పొక్కడంతో అచ్చంపేట డీఎస్పీ పల్లె శ్రీనివాస్ సీఐ రవీందర్ లో తమ సిబ్బందితో రిస్క్యూ ఆపరేషన్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ చీకటి పడటంతో బాధితుల వద్దకు చేరుకోలేక తిరిగి వెనక్కి వచ్చారు.
మంగళవారం ఉదయం రెస్క్యూ ఆపరేషన్..
దిండి వాగులోని గుర్రాల బండ సిద్దాపూర్ గ్రామ సమీప అటవీ ప్రాంతంలో వాగులో చిక్కుకున్న పదిమంది చెంచు గిరిజనులను కాపాడేందుకు ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అచ్చంపేట దేవరకొండ డిఎస్పీలు పల్లె శ్రీనివాస్ గిరిబాబు ఇద్దరు సీఐలు ఎస్సైలు 30 మంది పోలీసులు ఫైర్ సిబ్బంది గజ ఈతగాళ్లతో ఐదు ఆరు గంటలు రిస్క్యూ ఆపరేషన్ చేసి వాగులో చిక్కుకున్న పదిమంది గువ్వలోనిపల్లి గ్రామానికి చెందిన పదిమంది చెంచు గిరిజనులను సురక్షితంగా కాపాడారు.
ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రవీందర్ పర్యవేక్షణలో..
వాగులో చిక్కుకున్న చెంచు కుటుంబాలకు నిత్యవసర సరుకులు, తాగునీరు, మందులు పంపిణీ చేశారు. వాగులో చెక్కున్న వారిలో ఇద్దరు చిన్నపిల్లలు ఉండటంతో వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి ఎటువంటి ప్రమాదం లేదని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ దేవరకొండ ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ దేవరకొండ ఎమ్మెల్యే రవీందర్ నాయకులు తెలిపారు. సరిహద్దు ప్రాంత దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ విషయం తెలుసుకొని అచ్చంపేట ఎమ్మెల్యే గారితో కలిసి వరదల్లో చిక్కుకున్న చెంచు కుటుంబాలను పరామర్శించి వారికి పునరావాసం మనోధైర్యం కల్పించి అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం మెరుగైన వైద్యం మరియు వారికి కావలసినటువంటి ఆహార పదార్థాలను అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న వేళ అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలిగిన వెంటనే సమాచారం పోలీసు రెవెన్యూ శాఖ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు సమాచారం తెలియజేయాలని కోరారు.