జాతీయ రహదారి పక్కన గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం

by Hamsa |
జాతీయ రహదారి పక్కన గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం
X

దిశ, జడ్చర్ల: జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డు హౌసింగ్ బోర్డు కాలనీ 167వ జాతీయ రహదారి పక్కన గుర్తు తెలియని మహిళ (40) శవం శనివారం ఉదయం లభ్యమైంది. మృతురాలి ఒంటిపై గాయాలు ఉండడం ముక్కులో, చెవుల నుండి రక్తం కారుతుండడంతో మహిళ మృతి పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదవశాత్తు చనిపోయిందా..లేక ఎవరైనా హత్య చేసి ఇక్కడ పడేశారా..? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అనుమానాస్పదంగా గుర్తుతెలియని మహిళ శవం పడి ఉన్న విషయం తెలుసుకున్న స్థానిక పట్టణ సీఐ రమేష్ బాబు ఎస్ఐ లెనిన్ గౌడ్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిసరాలను పరిశీలించారు. మృతురాలి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిసరాలను సిసి ఫుటేజ్‌ను పరిశీలించి కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టనున్నట్లు సీఐ రమేష్ బాబు తెలిపారు.

Advertisement

Next Story