- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
A cricket match: ఉత్సాహంగా సాగిన పోలీస్, ప్రెస్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్
దిశ,నారాయణపేట క్రైమ్: నారాయణపేట జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్ మైదానంలో పోలీస్ ప్రెస్, ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్ ఉత్సాహంగా కొనసాగింది. మొదట టాస్ విన్ అయిన ప్రెస్ టీం 16 ఓవర్లలో 97 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ బరిలో నిలిచిన పోలీస్ జట్టు, ప్రెస్ టీంపై 14 ఓవర్ ల రెండు బాల్స్ లో 8 వికెట్లు కోల్పోయి విజయం సాధించారు. చివరి ఓవర్లో ఎంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. క్రికెట్ పోటీలో భాగంగా ఎస్పీ యోగేష్ గౌతమ్ స్వయంగా బ్యాటింగ్..బౌలింగ్ చేసి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. పోలీస్ టీం లో ఎస్ఐ నవీన్ మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..సమాజ శ్రేయస్సు కోసం పాటుపడే పోలీస్..ప్రెస్ కు మధ్య మంచి సత్సబంధాలు..స్నేహ పూర్వక వాతావరణం ఉండేందుకు ఈ క్రికెట్ టోర్నమెంట్ ఎంతో దోహదపడుతుందన్నారు. అనంతరం విజేత జట్టుకు.. రన్నరప్ జట్టుకు..మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ క్రీడాకారునికి ట్రోపీని అందించి ఎస్పీ అభినందించారు. పోటీలో అడిషనల్ ఎస్పీ రియాజ్, డి.ఎస్.పి లింగయ్య,ఆర్ఐ నరసింహా,డిపిఆర్ఓ రషీద్,సీఐ రామ్ లాల్,ఎస్సైలు రాజు, భాగ్యలక్ష్మి రెడ్డి,వెంకటేశ్వర్లు,రాముడు,ఆర్ఎస్ఐ శివశంకర్, టీయూడబ్ల్యూజే ఐజేయూ జిల్లా అధ్యక్షులు నారాయణరెడ్డి,డిజిటల్ మీడియా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రఘు గణప,మధుకర్,సంజీవ ప్రకాష్, నక్క శ్రీనివాస్,ముజాయిద్ సిద్ధిఖీ,పిఆర్ఓ వెంకట్ తో పాటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పోలీస్ బృందం పాల్గొన్నారు. కాగ స్కోరర్ లుగా ఫిజికల్ డైరెక్టర్లు కతలప్ప, మౌలాలి,శ్రీధర్ గౌడ్ లు ఎంపర్లుగా టక్ అంబదాస్,రమేష్,కామెంట్రీ గా సురేష్ లు వ్యవహరించారు.