- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాలమూరు పార్లమెంట్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నా
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: పాలమూరు పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు, మహబూబ్ నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని సుదర్శన్ కన్వెన్షన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన బూత్ లెవల్ ఏజెంట్ల సమావేశంలో ఆయన ప్రసంగించారు. గతంలో ఎంపీలుగా ఉన్నవారు అభివృద్ధి జరగక, ఎక్కడి సమస్యలు అక్కడే తిష్ట వేసుకుని కూర్చున్నాయని, తాను గెలిచాక తాగు సాగు నీరు ప్రతి ఒక్కరికీ అందేలా చేస్తానని, అన్ని రంగాల్లో అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తానని హామీ ఇచ్చారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో 14 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించ బోతుందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను తప్పక అమలు పరుస్తామని ఆయన అన్నారు. కార్యకర్తలే పార్టీకి పునాదిరాళ్లని, వారు కష్టపడి పని చేస్తేనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటామని, ఎమ్మెల్సీ, పార్లమెంటు ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని ఆయన భరోసానిచ్చారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్ యాదవ్, వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు అజ్మత్ అలీ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, సురేందర్ రెడ్డి,ఎస్పీ వెంకటేష్, సిరాజ్ ఖాద్రీ తదితరులు పాల్గొన్నారు.