- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చదువుతో పాటు లైఫ్ స్కిల్స్ పెంపొందించుకోవాలి : మహబూబ్ నగర్ కలెక్టర్
దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: సంపూర్ణ వ్యక్తి వికాసానికి చదువుతో పాటు ఆరోగ్యం,లైఫ్ స్కిల్స్ పెంపొందించుకుంటూ,అన్ని విషయాలపై విజ్ఞాన సముపార్జన పెంచుకోవాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో మహిళా,శిశు,దివ్యాంగులు వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ బాలల దినోత్సవ కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి,జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి మాట్లాడారు.పిల్లలు పాఠశాలలో పాఠ్య పుస్తకాలతో పాటు మన చుట్టూ ప్రపంచంలో జరుగుతున్న శాస్త్ర,సాంకేతిక,సమకాలీన అంశాలపై విజ్ఞాన సముపార్జనకు ఇతర పుస్తకాలను కూడా చదవాలని సూచించారు.
పిల్లల చదువుతో శారీరక ఆరోగ్యం కలిగి ఉండాలంటే యోగా,క్రీడల్లో పాల్గొనాలని అన్నారు.నేటి బాలలు రేపటి భావి భారత పౌరులు గా ఉన్నత చదువులు చదివి జీవితంలో వివిధ రంగాలలో స్థిరపడాలని అన్నారు.ఇందుకు క్రమశిక్షణ కలిగిన జీవన శైలి అలవర్చుకోవాలని,చదువు,ఆరోగ్యం కు ప్రాధాన్యతనిస్తూ తెలుగు భాషతో పాటు,ఆంగ్లం,హిందీ భాషలు నేర్చుకోవాలని,లైఫ్ స్కిల్స్,కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలని అన్నారు.బాలల హక్కుల పట్ల అవగాహన ఉండాలని పిల్లల సంక్షేమంకు బాలల హక్కుల కమిషన్,జువైనల్ సంక్షేమ బోర్డు,మహిళా శిశు సంక్షేమ శాఖలు పని చేస్తున్నట్లు తెలిపారు. బాలలు ఎటువంటి సమస్యలు ఎదురైనా చైల్డ్ లైన్ నెంబర్ 1098 కు ఫోన్ చేస్తే సమస్య పరిష్కారం చేస్తారని అన్నారు.
ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సంస్థ ద్వారా పిల్లలకు పుస్తకాలు,పెన్నులు,కంపాక్స్ బాక్స్ పది వస్తువులతో కూడిన 300 కిట్ లను ఆమె అందజేశారు.ఈ సమావేశంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ నయిమోద్దీన్,కమిటీ సభ్యులు,జువెనైల్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు శ్రీమతి గ్రెస్సీ,రెడ్ క్రాస్ చైర్మన్ నటరాజ్,సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షుడు జగపతిరావు జిల్లా సంక్షేమ అధికారిణి జరీనా బేగం,బీసీ సంక్షేమ అధికారిణి ఇందిర,డిపిఆర్ఓ శ్రీనివాస్,డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ ఇస్రా,సర్వ శిక్షణ అభియాన్ సీఎంఓ బాలు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.