- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అందరి చూపు పాలమూరు వైపు!
దిశ బ్యూరో, మహబూబ్ నగర్: అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో అందరి దృష్టి మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం వైపు సాధిస్తున్నారు. రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ నియోజకవర్గం నుంచి మరోసారి పోటీ చేసే అవకాశం తిరిగి ఆయనకే లభించింది. ఎలాగైనా మరోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలన్న లక్ష్యంతో మంత్రి ముందుకు సాగుతున్నారు. ప్రతిరోజు అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలతోనే కాకుండా పలు ప్రైవేట్ కార్యక్రమాలలోనూ పాల్గొంటూ నియోజకవర్గంపై మరింత పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రతిపక్షాలకు అవకాశాలు లేకుండా శ్రీనివాస్ గౌడ్ ప్రచారాలతో ముందుకు సాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో మంత్రిని ఢీకొట్టే ప్రత్యర్థులు ఎవరన్న అంశంపై జోరుగా ప్రచారం సాగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలో నుంచి ఎవరు రంగంలో ఉండబోతున్నారన్న అంశంపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చర్చలు కొనసాగుతున్నాయి. ఇక, టీడీపీ నుండి మెట్టుకాడి శ్రీనివాస్ ముదిరాజ్ పేరును ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఖరారు చేశారు.
బీజేపీ నుంచి జితేందర్ రెడ్డి?
భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పోటీలో ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎంపీలు, మాజీ ఎంపీలు ,ఎమ్మెల్యేలు,మాజీ ఎమ్మెల్యేలు తప్పనిసరిగా పోటీలో ఉండాలని అధిష్టానం ఆదేశించిన నేపథ్యంలో జితేందర్ రెడ్డి పోటీలో ఉంటారని ప్రచారం జరుగుతోంది. ఎందుకు అనుకూలంగానే ఆయన పలు కార్యక్రమాలకు హాజరవుతున్నారు. వచ్చే ఎన్నికలలో తనతో పాటు మిథున్ రెడీ కి షాద్‌నగర్ పోటీ చేసే అవకాశం ఇవ్వాలని జితేందర్ రెడ్డి అధిష్టానానికి ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. రెండు టికెట్లు కాకుండా ఒకటి మాత్రమే ఖరారు చేస్తే తనకు కాకుండా టికెట్ తన కుమారుడికి ఇవ్వాలి అని జితేందర్ రెడ్డి అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు.
రెండు టికెట్లు కేటాయిస్తే పాలమూరు నుంచి జితేందర్ రెడ్డి, షాద్‌నగర్ నుంచి మిథున్ రెడ్డి రంగంలో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఒకే కుటుంబంలో ఇద్దరికీ టికెట్లు ఇచ్చే అవకాశం లేదని అధిష్టానం స్పష్టం చేస్తే మాత్రం జితేందర్ రెడ్డి టికెట్‌ను తన కుమారుడికి ఇవ్వాలని చెప్పే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే జితేందర్ రెడ్డి పాలమూరు నియోజకవర్గం నుంచి పోటీలో ఉండటం ఖాయం అని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కాంగ్రెస్‌లో కన్ఫ్యూజన్..
ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది కాంగ్రెస్ పార్టీలో రోజురోజుకు ఉత్కంఠ పెరుగుతోంది . నియోజకవర్గం నుంచి పలువురు ముఖ్య పోటీలో ఉండే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరిగింది. పార్టీ అధిష్టానానికి టికెట్ల కోసం గడువు లోపల పీసీసీ ఉపాధ్యక్షుడు ఒబేద్ ఉల్లా కొత్వాల్, ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్, కార్యదర్శి వినోద్ కుమార్, రాఘవేందర్ రాజు ఇటీవల తిరిగి పార్టీలో చేరిన ఎన్పి వెంకటేష్, తదితరులు టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో నుంచి అభ్యర్థులను ఎంపిక చేస్తారా.. లేక ఇతర ప్రముఖ వ్యక్తులను పార్టీలో చేర్చుకుని ఇస్తారా అన్న అంశంపై పార్టీ వర్గాలలో ఉత్కంఠ కలిగిస్తోంది.నియోజకవర్గం నుంచి మైనార్టీలకు కేటాయించి ఇవ్వాల్సి వస్తే కొత్వాలకు, ముదిరాజ్ సామాజిక వర్గానికి కేటాయించవలసి వస్తే సంజీవ్ ముదిరాజ్, ఎన్పీ వెంకటేష్ లలో ఒకరికి అవకాశం ఉంటుందని తెలుస్తోంది.మొత్తంపై ఏ ఇద్దరు కలిసిన పాలమూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిస్థితులపైన, అభ్యర్థుల ఎంపిక అంశంపైన జోరుగా చర్చలు జరుగుతూ ఉన్నాయి.