- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
DSP N.Lingaiah : దొంగతనాలకు పాల్పడిన నిందింతుల అరెస్ట్...
దిశ, నారాయణపేట క్రైమ్ : ఇటీవల నారాయణపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మూడు దొంగతనాల కేసులను క్రైం పార్టీ పోలీసు బృందం కృషితో చేదించినట్లు డీఎస్పీ ఎన్.లింగయ్య తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టౌన్ ఎస్సై అందే వెంకటేశ్వర్లుతో కలిసి డీఎస్పీ దొంగతనాలకు కేసులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నారాయణపేట శాసన్ పల్లి రోడ్డు మార్గంలో ఉన్న భారత్ గ్యాస్ లో జిల్లా కేంద్రంలోని గాంధీనగర్ కు చెందిన నగిరి ఆనంద్ ఆగస్టు 8న రాత్రి 25 గ్యాస్ సిలిండర్లు దొంగిలించినట్లు తెలిపారు. అలాగే నెల రోజుల క్రితం నారాయణపేట పట్టణంలోని పల్లా వీధిలో అనారోగ్యంతో బాధపడుతున్న వారిని మాయమాటలతో మభ్యపెట్టి ఆరోగ్యం పూజలు చేసి బాగు చేస్తానని చెప్పి మోసం చేసిన నారాయణ పేట సుభాష్ రోడ్ బారంబావి కుంటకు చెందిన గజ్జెలి నరేష్ ను అరెస్టు చేసినట్లు తెలిపారు.
అలాగే నారాయణపేట మండలం బైరంకొండ గ్రామానికి చెందిన విజయలక్ష్మి ఇంట్లో ఆగస్టు 7వ తేదీ రాత్రి చోరీ జరిగిందని, చోరీకి పాల్పడింది జాజాపూర్ గ్రామానికి చెందిన మన్నే వెంకటేష్ గా గుర్తించి చోరీ చేసిన సుమారు 70 వేల విలువ చేసే బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నారన్నారు. ఈ మూడు కేసులకు సంబంధించి ముగ్గురు నిందితులను మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచినట్లు డీఎస్పి విలేకరులకు తెలిపారు. కేసులను ఛేదించటంలో ప్రత్యేకంగా కృషిచేసిన ఎస్సై వెంకటేశ్వర్లు, హెడ్ కానిస్టేబుల్ నారాయణ, క్రైమ్ పార్టీ పోలీసులు పీసీ 1036 ఆంజనేయులు, పీసీ 1014 రాములు, పీసీ రాజు గౌడ్, పీసీ 1191 యాదయ్య , పీసీ 746 మల్లేష్, పీసీ 2677 లింగమూర్తి, పీసీ 3258 సురేష్ లను డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించి నగదు రివార్డును అందించారు.