అబ్బా మస్త్ షేడ్స్ ఉన్నాయి రా నీలో..నాగుపాము

by Naveena |
అబ్బా  మస్త్ షేడ్స్ ఉన్నాయి రా నీలో..నాగుపాము
X

దిశ, వీపనగండ్ల: పానగల్ మండలం చింతకుంట గ్రామ సమీపంలో విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. ఓ ట్రాక్టర్ ముందు నాగుపాము పడగ విప్పుకొని పెద్ద పెద్ద శబ్దాలతో బుసలు కొట్టింది. అయితే డ్రైవర్ ట్రాక్టర్ ను వెంటనే వెనక్కి తీస్తుండగా.. ట్రాక్టర్ ఎటు వెళ్లే అటుగా నాగుపాము అడ్డొచ్చింది.ఈ క్రమంలో 40 నిమిషాల పాటు..ట్రాక్టర్ దగ్గరనే నాగుపాము ఆగి ఉందని స్థానికులు తెలిపారు. దీంతో ఒక్కసారిగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్నేక్ సొసైటీ అధ్యక్షులు కృష్ణసాగర్ కి సమాచారం ఇవ్వగా..చాకచక్యంగా నాగుపామును బంధించారు. ఈ సందర్భంగా స్నేక్ క్యాచర్ మాట్లాడుతూ..పాములు ఎక్కువగా ఆకలితో ఉన్నప్పుడు మనుషులను కానీ..శబ్దాలను గ్రహించి పెద్దగా పట్టించుకోకుండా ఆహారం కోసం వెతుకుతూ ఉంటాయన్నారు.

Next Story

Most Viewed