నా స్కూల్.. నా ఇష్టం..

by Sumithra |
నా స్కూల్.. నా ఇష్టం..
X

దిశ, వంగూర్ : మండల పరిధిలోని డిండి చింతపల్లి గ్రామంలో మంగళవారం ప్రైమరీ పాఠశాలలో ఉదయం 9 గంటలకు రావలసిన ఉపాధ్యాయులు పది కావస్తున్నా రాకపోవడంతో విద్యార్థులు క్లాస్ రూముల్లో కూర్చున్నారు. అనంతరం గమనించిన ఒక వ్యక్తి క్లాస్ రూములలో విద్యార్థులే తప్ప ఉపాధ్యాయులు రాలేదని, ఇప్పటి వరకు పాఠశాలకు ఉపాధ్యాయులు రాకపోవడంతో తన సెల్ ఫోన్ తో వీడియోలు తీస్తుండగా అప్పుడే వచ్చిన ఉపాధ్యాయుడు అతనిని నీవు ఎవరు, నీకు ఏమి హక్కు ఉంది, నన్ను ప్రశ్నించే హక్కు నీకు ఎవరు ఇచ్చారు. నువ్వు ఫస్ట్ బయటకు వెళ్ళు లేదంటే పోలీసులను పిలుస్తా అని అతని పై దురుసుగా ఉపాధ్యాయుడు ప్రవర్తించాడు. అందుకే ప్రభుత్వం ఉపాధ్యాయుల పై తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు.

Advertisement

Next Story

Most Viewed