- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బస్సులో ప్రయాణికుడికి గుండెపోటు.. బతికించడానికి కండక్టర్, ఆర్ఎంపీ డాక్టర్ విశ్వప్రయత్నం చేసినా..
దిశ, మిడ్జిల్: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుడికి ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో బస్సులోనే కుప్పకూలిపోయాడు. ఇది గమనించి వెంటనే స్పందించిన బస్సు కండక్టర్ సురేందర్, బస్సును పక్కన నిలిపేసి బస్సులో ప్రయాణిస్తున్న మరో ఆర్ఎంపీ డాక్టర్, కుటుంబ సభ్యులతో కలిసి బస్సులోనే గుండెపోటుకు గురైన ప్రయాణకుడికి సీపీఆర్ చేసి బతికించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. బస్సు కండక్టర్ సురేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. కల్వకుర్తి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో మిడ్జిల్ మండల పరిధి మున్ననూర్ గ్రామంలో వడ్ల కృష్ణయ్య (48), తన నలుగురు కుటుంబసభ్యులతో కలిసి జడ్చర్ల వరకు టికెట్ తీసుకున్నారు. బస్సులో ఎక్కిన ఐదు నిమిషాలకే వడ్ల కృష్ణయ్యకు తీవ్ర గుండె పోటు వచ్చి బస్సులోనే కుప్పకూలిపోయాడు. దీంతో కండక్టర్ సురేందర్ బస్సులో ప్రయాణిస్తున్న కల్వకుర్తి పట్టణానికి చెందిన మరో ఆర్ఎంపీ డాక్టర్ సహాయంతో వడ్ల కృష్ణయ్య చాతిపై చేతులతో సీపీఆర్ చేస్తూ బతికించే ప్రయత్నం చేశారు.
ఇదంతా గమనిస్తున్న బస్సులోని తోటి ప్రయాణికులు ఆపదలో ఉన్నవారికి సహాయం చేసేది మరిచి బస్సు ఆపవద్దు తమకు ఆలస్యమైతుందని, బస్సును ముందుకు పోనించాలని మానవత్వం మరిచి కండక్టర్ తో వాదనకు దిగారు. అయినా కూడా ఇవేవి పట్టించుకోని కండక్టర్ సురేందర్ 108కు ఫోన్ చేసి సహాయం కోరాడు. అంబులెన్స్ రావడానికి ఆలస్యం అవుతుండడంతో కృష్ణయ్య కుటుంబ సభ్యులు మరో ఆటోను రప్పించి కృష్ణయ్యను ఆసుపత్రికి తీసుకెళ్లారు. జడ్చర్ల ఆసుపత్రిలో కృష్ణయ్యను పరిశీలించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు.