- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంటింటి కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి
దిశ, కొల్లాపూర్: సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల వివరాల సేకరణ కోసం నిర్వహిస్తున్న సమగ్ర సర్వేను పగడ్బందీగా నిర్వహించాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఎన్యుమరేటర్లకు సూచించారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా ఎన్యుమరేటర్లు నిర్వహిస్తున్న కుటుంబాల వివరాల సేకరణ ప్రక్రియను బుధవారం జిల్లా కలెక్టరు బాదావత్ సంతోష్, పరిశీలించారు. కొల్లాపూర్ పట్టణం వార్డ్ నెంబర్ 19 లోని మరాఠీ కృష్ణయ్య ఇంటి దగ్గర జరుగుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణను , ఏన్యూమరేటర్లు నమోదు చేస్తున్న వివరాలను పరిశీలించారు. ఇంటి యజమానులు సహకరిస్తున్నారా అని ఏన్యూమరేటర్లను అడిగి తెలుసుకున్నారు. సర్వే కు వెళ్ళే ముందు ఇంటి యజమానులకు ముందస్తు సమాచారం ఇవ్వాలని తెలియజేశారు. ఇప్పటివరకు ఎన్ని ఇళ్లలో సర్వే పూర్తయ్యింది, కుటుంబ వివరాల సేకరణ సందర్భంగా ఏవైనా ఇబ్బందులు ఎదురయ్యాయా? కొత్తగా గమనించిన అంశాలు ఏమైనా ఉన్నాయా? అని ఆరా తీశారు.
ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ ..సర్వే ను జాగ్రత్తగా ఎలాంటి లోపాలు జరుగకుండా నిర్వహించాలని సూచించారు. వివరాలను సేకరించేటప్పుడు కుటుంబ యజమానులు వారి వారి ఆధార్, ఓటర్, అవసరమైన కార్డులను చూసి నివేదికలను నింపాలని ఎన్యుమరేటర్లకు సూచించారు. సర్వేకు సంబంధించిన ప్రొఫార్మలను పరిశీలించి ఏ విధంగా నమోదు చేస్తున్నారని, కుటుంబ సభ్యులను ఏమేమి ప్రశ్నలు అడుగుతున్నారని ఎన్యుమరేటర్ ను అడిగి తెలుసుకున్నారు. ప్రొఫార్మాలు పూరించేందుకు కోడింగ్ ను ఉపయోగించాలని ఎన్యుమరేటర్ లకు సూచించారు. ప్రతి కుటుంబంలోని ఒక్కో వ్యక్తి వారీగా పూర్తి సమాచారాన్ని సేకరించాలని ఎన్యూమరేటర్ కు సూచించారు. ఏ చిన్న తప్పిదానికి సైతం తావు లేకుండా నిర్ణీత కోడ్ లను పొందుపరుస్తూ..స్పష్టమైన సమాచారంతో దరఖాస్తు పూరించాలని అన్నారు. ప్రతీ ఎన్యూమరేటర్ ఇళ్లను సందర్శిస్తూ.. సర్వే ప్రక్రియను వేగవంతంగా నిర్వహించాలని సూచించారు. సర్వే ప్రక్రియను నిశితంగా పర్యవేక్షణ చేయాలని సూపర్వైజర్లను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్డిఓ బన్సీ లాల్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసన్, తాహసిల్దార్ విష్ణువర్ధన్ రావు తదితరులు ఉన్నారు.