theft: 6 సార్లు దొంగతనం చేసిన దొంగలు..7 సారి ఏం జరిగిదంటే..?

by Naveena |   ( Updated:2024-11-03 15:25:58.0  )
theft:  6 సార్లు దొంగతనం చేసిన దొంగలు..7 సారి ఏం జరిగిదంటే..?
X

దిశ, దేవరకద్ర: రైతులు వ్యవసాయ పొలాల్లో, ఇంటిదగ్గర కట్టేసిన పశువులను దొంగతనం చేస్తున్న ముఠాను పట్టుకున్న సంఘటన దేవరకద్ర మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఈ సందర్భంగా డిఎస్పి వెంకటేశ్వర్లు ,సిఐ రామకృష్ణ ఎస్సై నాగన్న నిందితులను అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు.అనంతరం డీఎస్పీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..లింగాల ,నందికొట్కూర్ కోరుకొండ ,కొల్లాపూర్ ప్రాంతాలకు చెందిన దొంగల ముఠా.. దేవరకద్ర తాండూర్ ,తిమ్మాజీపేట, జడ్చర్ల కల్వకుర్తి, భూత్పూర్ ప్రాంతాల్లో పశువులను దొంగతనాలు చేసేవారని తెలిపారు. ఈ నేరస్తులు ఒక ప్రాంతం నుంచి పశువులు దొంగతనం చేసి.. మరో ప్రాంతంలో అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారని తెలిపారు.గత వారం రోజులుగా ఈ ముఠాను పట్టుకోవడానికి దేవరకద్ర పోలీసులు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో.. శనివారం సాయంత్రం దేవరకద్ర ఎస్ఐ నాగన్న తన సిబ్బందితో కలిసి అమ్మపూర్ ఎక్స్ రోడ్ వద్ద వాహనాలు తనిఖీ చేశారు. రైయిచూర్ వైపు ఒక బొలెరో వాహనంలో రెండు ఎద్దులు తీసుకొని వెళుతుండగా అనుమానం వచ్చి వివరాలు అడగగా అందులో ఉన్న 5 మంది నేరస్తులు పారిపోవడానికి ప్రయత్నించారు .దీంతో దేవరకద్ర పోలీసులు చాకచక్యంగా నిందితులను పట్టుకొన్నారు.నేరస్తులను విచారించగా తాము పలు ప్రాంతాలలో పశువులను దొంగతనం చేసి రైయిచూర్ లో అమ్ముతున్నామని తెలిపారు.

నిందితులు 6 సార్లు దొంగతనం చేయగా.. మొదటిసారి పట్టుబడ్డారని తెలిపారు. దేవరకద్ర మండలం వెంకటాయపల్లి గ్రామానికి చెందిన ఒక రైతు కు చెందిన రెండు బర్రెలు ,రెండు దూడలు బాధితులకు అప్పగించారు. పట్టుబడిన పశువుల విలువ 2,80,000 ఉంటుందని డీఎస్పీ తెలిపారు. త్వరలో దొంగిలించబడిన పశువులను రికవరీ చేసి బాధితులకు అప్పగిస్తామని తెలిపారు. పట్టుబడిన నేరస్తులను అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరుస్తామని తెలిపారు.అనంతరం నేరస్తులను పట్టుకున్న ఎస్ఐ నాగన్న ,కానిస్టేబుల్ వెంకటేష్, నాను నాయక్ ను పోలీస్ సిబ్బందిని డిఎస్పి వెంకటేశ్వర్లు అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, సిఐ రామకృష్ణ, ఎస్సై నాగన్న ,పోలీస్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ రాజశేఖర్,యండి గఫర్, గోపి ,దత్తాత్రేయ ,బీజాపూర్ కాజారాం ,సురేష్,నవీన్,నాగేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story