- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రాణాలను బలిగొన్న భయం
దిశ, నవాబుపేట: చిన్నప్పటి నుంచి తనని వెంటాడుతూ వస్తున్న భయం ఓ యువకుడి నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. మండల పరిధిలోని కామారం గ్రామానికి చెందిన అమ్మాపురం రాఘవేందర్ (19) అనే యువకుడు మహబూబ్ నగర్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున 3గంటలకు మృతి చెందాడు. చిన్నప్పటి నుంచి ఒంటరిగా ఉండే రాఘవేందర్ తనకు చనిపోవాలని ఉందని, చనిపోతానని తల్లిదండ్రులతో తరచూ చెప్పేవాడు.
అలాంటి ఏమి జరగదని, భయపడొద్దని తల్లిదండ్రులు పదే పదే ఆ యువకుడికి ధైర్యం చెప్పినా కూడా మానసిక ఆందోళన ఎక్కువైన అతడు సోమవారం మధ్యాహ్నం తమ వ్యవసాయ పొలం దగ్గరికి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తమ సమీప బంధువు ద్వారా తెలుసుకున్న ఆయన కుటుంబ సభ్యులు వెంటనే 108 అంబులెన్స్ లో మహబూబ్ నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాఘవేందర్ మృతి చెందినట్లు ఎస్సై పురుషోత్తం తెలిపారు. మృతుడికి తల్లి, తండ్రి, ఇద్దరు సోదరులు ఉన్నారు. మృతుడి తండ్రి సత్తయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తునట్లు ఎస్సై తెలిపారు.
- Tags
- Suicide