ఎమ్మెల్యేను అవమానించే విధంగా పోస్టులు పెట్టిన వారిపై కేసు నమోదు..

by Kalyani |   ( Updated:2023-04-27 15:51:52.0  )
ఎమ్మెల్యేను అవమానించే విధంగా పోస్టులు పెట్టిన వారిపై కేసు నమోదు..
X

దిశ, బిజినేపల్లి: ఎమ్మెల్యేను అవమానించే విధంగా పోస్టులు పెట్టిన వారిపై కేసు నమోదు చేసిన సంఘటన బిజినేపల్లి పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళ్లితే.. మండల పరిధిలోని వెలుగొండ గ్రామానికి చెందిన భరద్వాజ్ గౌడ్, గౌరారం గ్రామానికి చెందిన కమండల నాగరాజుగౌడ్ లు నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిపై అవమానపరిచే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

దీంతో బీఆర్ఎస్ కు చెందిన వంశీ నాయక్ వారిపై పిటిషన్ ఇవ్వడంతో వారిపై కేసులు నమోదు చేశామని బిజినేపల్లి ఎస్ఐ ఓబుల్ రెడ్డి తెలిపారు. ఎవరైనా విదేశాలలో చదువుకోవడానికి వెళ్లాలంటే పాస్ పోర్ట్ తప్పనిసరిగా కావాలని, అందుకు పోలీస్ స్టేషన్ లో కేసులు, కోర్టు శిక్షలు ఉంటే అట్టివారికి పాస్ పోర్టు అవకాశం ఉండదని అందుకు ఎవరైనా సోషల్ మీడియా ఉపయోగించినప్పుడు జాగ్రత్తగా పోస్టులు పెట్టాలని సూచించారు.

Advertisement

Next Story