ఆ మండల అభివృద్ధికి 7.5కోట్ల నిధులు మంజూరు..

by Sumithra |
ఆ మండల అభివృద్ధికి 7.5కోట్ల నిధులు మంజూరు..
X

దిశ, ఉప్పునుంతల : ఉప్పునుంతల మండలంలోని వివిధ గ్రామాల అభివృద్ది ఏడు కోట్ల 50 లక్షల రూపాయల ప్రోసిడింగులను ఆయా గ్రామాల సర్పంచులకు పంపిణీ చేసినట్లు జడ్పీటీసీ అనంత ప్రతాప్ రెడ్డి గురువారం తెలిపారు. మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్యనాయకులతో, వివిధ గ్రామసర్పంచులతో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి గ్రామాలకు విడుదలైన నిధుల గురించి ఆయన వివరించారు. అచ్చంపేట ఎమ్మెల్యే బాలరాజు చొరవతో ఏడు కోట్ల 50 లక్షల రూపాయలు సీసీ రోడ్లు, దేవాలయాలు, మసీదులు, ఈద్గాలను గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధికి నిధులు మంజూరు చేశామన్నారు.

మంజూరు అయిన నిధుల పనులను సకాలంలో పూర్తిచేసి ఎమ్మెల్యేని మంత్రి పదవిలో కూర్చోబెట్టాలని సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు కంకణ బద్ధులై పనిచేసి పార్టీని మరింత ప్రతిష్టపరిచే విధంగా చేయాలని వారు కోరారు. నిధులు విడుదల కానీ గ్రామాల్లో ఏ పనులకు ఎంత బడ్జెట్ అవసరముందో ప్రణాళిక తయారు చేసుకొని నివేదిక ఇవ్వాలని వారు కోరారు. మంజూరైన నిధులను ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసుకొని అందరికీ అనుకూలంగా ఉండే విధంగా పనులు పూర్తి చేయాలని సూచించారు. పీఏసీఎస్, ఉమ్మడి జిల్లా డీసీబీ చైర్మన్ సత్తు భూపాల్ రావు, ఉప్పునుంతల మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త రవీందర్రావు, బాలునాయక్, కృష్ణయ్య, శోభన్ రెడ్డి, పర్వతాలు, పార్టీ ఉపాధ్యక్షులు గణేష్, సిహెచ్ సుధాకర్, ఎల్లయ్య, కొట్టే తిరుపతయ్య, శేఖర్, శంకర్, అధ్యక్షులు శ్రీను ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story