బీఆర్ఎస్‌లోకి మధ్యప్రదేశ్ నేతలు.. స్వయంగా కండువా కప్పి ఆహ్వానించిన కేసీఆర్

by Satheesh |   ( Updated:2023-06-07 16:08:38.0  )
బీఆర్ఎస్‌లోకి మధ్యప్రదేశ్ నేతలు.. స్వయంగా కండువా కప్పి ఆహ్వానించిన కేసీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీలోకి మధ్యప్రదేశ్‌కు చెందిన సామాజిక కార్యకర్త ఆనంద్ రాయ్‌తో పాటు పలువురు నేతలు చేరారు. ప్రగతిభవన్‌లో బుధవారం బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మధ్యప్రదేశ్‌లో గిరిజనుల హక్కుల కోసం పోరాడుతున్న “జై ఆదివాసి యువశక్తి సంఘటన్ (జేఏవైఎస్)” గిరిజన హక్కుల వేదిక బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా జేఎవైఎస్ ఫౌండర్ విక్రమ్ అచ్చాలియా మాట్లాడుతూ.. తెలంగాణలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనార్టీల అభివృద్దే ధ్యేయంగా పాలన కొనసాగుతున్నాయని తెలిపారు.

దేశంలో గుణాత్మక మార్పు తీసుకురావడానికి కృషి చేస్తున్న కేసీఆర్‌కు సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా బీఆర్ఎస్ ఎదుగుతున్నదని ఆకాంక్షించారు. పార్టీలో చేరిన వారిలో జేఏవైఎస్ ప్రస్తుత అధ్యక్షుడు లాల్ సింగ్ బర్మన్, పంచం భీల్, అశ్విన్ దూబె, గాజీరామ్ బడోలే, కైలాశ్ రాణా తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో జాయ్స్ జాతీయ అధ్యక్షుడు లోకేష్ ముజాల్దా, వుమన్ ఇన్చార్జీ సీమా వాస్కాలె, మధ్యప్రదేశ్ అధ్యక్షుడు రాందేవ్ కకోడియా ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed