Madhu Yaskhi Goud: ‘వారంలో 4 రోజులు ఎంజాయ్ చేసేందుకు నీకులా నాకు ఫామ్ హౌస్ లేదు’ మధుయాష్కి కౌంటర్

by Prasad Jukanti |   ( Updated:2024-08-24 13:26:55.0  )
Madhu Yaskhi Goud: ‘వారంలో 4 రోజులు ఎంజాయ్ చేసేందుకు నీకులా నాకు ఫామ్ హౌస్ లేదు’ మధుయాష్కి కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేటీఆర్ ఇకనైనా అబద్ధాలు, చిల్లర మాటలు మానుకోవాలని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకులైన మధుయాష్కీ గౌడ్ తో పాటు మరికొంత మందికి ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ లో అక్రమ నిర్మాణం ఉందని హైడ్రా ముందు వాటిని తొలగిచాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మధుయాష్కి శనివారం ఫేస్ బుక్ వేదికగా స్పందించారు. మాకు గండిపేట దగ్గర మామిడి తోట, సపోటా తోట ఉన్న మాట వాస్తవమేనని, అక్కడ వాచ్ మెన్ కుటుంబం ఉండటం కోసం పాతబడిన చిన్న నిర్మాణం తప్ప మీకులా రాజభోగాలు అనుభవించేందుకు ఫామ్ హౌస్ లేదన్నారు. ఎఫ్ టీఎల్, బఫర్ జోన్లలో వ్యవసాయం, తోటల పెంపంకం చేయొచ్చు అనే కనీస అవగాహన నీకు లేనట్లుందని ధ్వజమెత్తారు. కానీ నాకు ఫామ్ హౌస్ ఉన్నట్లు, అది ఎఫ్ టీఎల్ బఫర్ జోన్ లో ఉన్నట్లు కేటీటీర్ పలు మార్లు ప్రస్తావించడం సిగ్గుచేటన్నారు. వారానికి నాలుగు సార్లు వెళ్లి ఎంజాయ్ చేయడానికి 111 జీవో కు వ్యతిరేకంగా జన్వాడలో ఫామ్ హౌస్ నిర్మించుకుని బినామీ పేర్లతో మెయింటెన్ చేస్తున్న కేటీఆర్ నాకు ఫామ్ హౌస్ ఎక్కడ ఉందో, ఎంత విలాసంగా నిర్మించుకున్నానో చూపించాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story