- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లిక్కర్ స్కామ్‌లో కవితను అరెస్ట్ చేయకపోవడానికి కారణం అదే: మధుయాష్కీ గౌడ్
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒక్కటేనని కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ విమర్శించారు.దేశంలో సంచలం సృష్టిస్తోన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసి.. ఎమ్మెల్సీ కవితను మాత్రం ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. ఆ రెండు పార్టీలు ఒకటే కాబట్టి.. కవితను అరెస్ట్ చేయడం లేదని అన్నారు.
అదానీ కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే బీజేపీ తెరపైకి తీసుకువచ్చిందని ఆరోపించారు. ఇసుక అక్రమ రవాణా నుండి మద్యం మాఫియాలోకి కల్వకుంట్ల కుటుంబం వెళ్లిందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ప్రజాసమస్యలను గాలికి వదిలి లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితను రక్షించే పనిలో పడ్డారని ఫైర్ అయ్యారు. తెలంగాణ మంత్రులంతా కవిత రక్షణగా ఢిల్లీలో మకాం వేశారన్నారు. తెలంగాణ మద్యం పాలసీపైనా కూడా ఈడీ, సీబీఐ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.