- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Madhavi Latha: ఉదయనిధి స్టాలిన్‌పై మాధవి లత సంచలన వ్యాఖ్యలు.. మీ తల్లి, భార్య.. అంటూ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లే లక్ష్యంగా పెట్టుకుని కమలం పార్టీ అందుకు అనుగుణంగా పని చేస్తోంది. దేశ వ్యాప్తంగా తమ ఉనికిని చాటేందుకు బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపుతోంది. ఈ నేపథ్యంలోనే అసదుద్దీన్ ఓవైసీ అడ్డా.. హైదరాబాద్ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు బీజేపీ మాధవి లతను బరిలో నిలిపింది. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా ఆమె క్యాంపెయిన్ జోరుగా కొనసాగుతోంది. తాజాగా ఈమె 'ఆప్ కి అదాలత్' అనే షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాధవి లతను ప్రశంసిస్తూ ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ తన ఎక్స్(ట్విటర్) ఖాతాలో.. ‘మాధవి లతా జీ, మీ ‘ఆప్ కీ అదాలత్’ ఎపిసోడ్ అసాధారణమైనది. మీకు నా శుభాకాంక్షలు’. ఇవాళ ఉదయం 10 గంటలకు లేదా రాత్రి 10 గంటలకు ఈ ప్రోగ్రామ్ రిపీట్ టెలికాస్ట్‌ను చూడాలని నేను ప్రతి ఒక్కరిని కోరుతున్నాను’ అంటూ ట్వీట్ కూడా చేశారు.
ఈ సందర్భంగా షో వ్యాఖ్యాత ‘డెంగ్యూ, మలేరియాల సనాతన ధర్మాన్ని తరమికొట్టాలంటూ డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ అంటున్నారు’. అందుకు మీరేమంటారు అని ప్రశ్నించారు. అందుకు మాధవీ లత సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘స్టాలిన్ గారు ముందుగా మీ తల్లి, భార్యను పూజలు చేయకుండా ఆపండి. ముందుగా మీ ఇళ్లల్లోని పూజ గదిని ఖాళీ చేయించండి’ అంటూ సవాల్ విసిరారు. భారత్‌లో సనాతన ధర్మాన్ని ఎవరూ అసహ్యించుకోలేరు అంటూ ఆమె రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు తమిళనాట సంచలనం సృష్టిస్తున్నాయి.