Drugs Case: డైరెక్టర్ క్రిష్ పాత్రపై మాదాపూర్ DCP కీలక వ్యాఖ్యలు

by GSrikanth |
Drugs Case: డైరెక్టర్ క్రిష్ పాత్రపై మాదాపూర్ DCP కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపింది. తాజాగా ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్‌లో గచ్చిబౌలి పోలీసులు ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ పేరును చేర్చారు. డ్రగ్స్ పార్టీ జరిగే సమయంలో రాడిసన్‌ హోటల్‌లో డైరెక్టర్‌ క్రిష్‌ ఉన్నట్లు పోలీసులు అనుమానించారు. మంగళవారం సాయంత్రం ఈ డ్రగ్స్ కేసు వివరాలను మాదాపూర్ డీసీపీ వినీత్ సమావేశంలో వెల్లడించారు. రాడిసన్ హోటల్ కేసును దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. నిందితుల బ్లడ్ శాంపిల్స్‌ను టెస్ట్ చేయగా.. డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. రాడిసన్ హోటల్‌లో అనేక పార్టీలు చేసుకున్నట్లు విచారణలో నిందితులు ఒప్పుకున్నట్లు డీసీపీ వెల్లడించారు.

డ్రగ్స్ పార్టీలో డైరెక్టర్ క్రిష్ పాల్గొన్నారో లేదో ఇంకా నిర్ధారణ కాలేదని చెప్పారు. వివేకానంద్‌కు క్రిష్‌కు ఎన్నాళ్ల నుంచి పరిచయం ఉందో తెలియాల్సి ఉందని అన్నారు. నిందితులు ఎక్కడి నుంచి డ్రగ్స్ తీసుకొస్తున్నారో దర్యా్ప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే, అనూహ్యంగా ఈ కేసులో క్రిష్ పేరు తెరపైకి రావడంతో మరోసారి టాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ కలకలం మొదలైంది. మరికొందరు సినీ సెలబ్రిటీల పాత్రపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ కేసులో మొత్తం పది మందిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

Advertisement

Next Story