- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఖాళీలు భర్తీ చేయండి సారూ’.. వేడుకుంటున్న సిబ్బంది
దిశ, తెలంగాణ బ్యూరో: దేవాదాయశాఖలో ఏండ్ల తరబడి పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి. వాటిని భర్తీ చేయడంలో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. దీంతో శాఖలో ఫైళ్ల కదలికలోనూ నెలల తరబడి జాప్యం జరుగుతోంది. ప్రస్తుతం శాఖలోని ఉద్యోగులపై పనిభారం పెరిగింది. పలు విభాగాల్లో సగం మంది ఉద్యోగులు సైతం లేకపోవడంతో ఆలయాల అభివృద్ధి పనులపై ఎఫెక్ట్ పడుతున్నదని పలువురు పేర్కొంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి ఖాళీలను భర్తీ చేస్తే శాఖలో పెండింగ్ ఫైళ్లకు మోక్షం లభిస్తుందని, ఎప్పటికప్పుడు పనులు చకచక అవుతాయని ఉద్యోగులు పేర్కొంటున్నారు.
ఖాళీల భర్తీకి చొరవ చూపని గత ప్రభుత్వాలు
గత ప్రభుత్వాలు దేవాదాయశాఖపై ఫోకస్ పెట్టలేదు. శాఖ ఉన్నప్పటికీ పటిష్టం చేయలేదు. ఖాళీల భర్తీకి చొరవ చూపలేదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత శాఖలోని ఉద్యోగులను విభజించారు. కానీ తెలంగాణకు సరిపడా సిబ్బందిని నియమించలేదు. శాఖలోని అన్ని విభాగాల్లో కావల్సిన సిబ్బంది లేదు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. సుమారు 111 మంది ఉద్యోగ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎండోమెంట్‌లోని డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పరిధిలో 77, ఇంజినీరింగ్ విభాగంలో 34 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కింద(అడ్మినిస్ర్టేషన్ విభాగం) మొత్తం 209 మంది ఉద్యోగులు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం 126 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఉద్యోగుల కొరతతో ఫైల్స్ ముందుకు కదలడం లేదని సమాచారం. గతంలో ఉన్నతాధికారులు ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ ప్రయోజనం లేదని ఉద్యోగులే పేర్కొంటున్నారు. టీజీపీఎస్‌సీ.. 14 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను నం.29/2022లో గ్రూప్-3 కింద నోటిఫికేషన్ ఇచ్చినట్టు తెలిసింది. అయితే, పోస్టులు ఇప్పటివరకు భర్తీ చేయలేదు.
ఖాళీలపై సర్కారుకు నివేదిక
దేవాదాయశాఖ అధికారులు శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగుల వివరాలను ప్రభుత్వానికి అందజేసినట్టు విశ్వసనీయ సమాచారం .టీజీపీఎస్‌సీకి సైతం లిఖితపూర్వకంగా పంపినట్టు తెలిసింది. అందులో అసిస్టెంట్ కమిషనర్ పోస్టులు 4, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ 5, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రూప్-3 కింద 54, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 14 ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇంజినీరింగ్ విభాగంలో 34 పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని, ఎస్ఈ, ఏఈ, డీఈ, డ్రాఫ్ట్‌మెన్, ట్రెజరర్ పోస్టుల వివరాలను ప్రభుత్వానికి అధికారులు అందజేసినట్టు విశ్వసనీయ సమాచారం. ఉద్యోగుల కొరత ఉండటంతో ఉన్న వారిపై అదనపు భారం పడుతోంది. ప్రభుత్వం స్పందించి ఖాళీల భర్తీపై దృష్టి సారించాలని పలువురు ఉద్యోగులు విజ్ఞప్తులు చేస్తున్నారు.
డిప్యూటేషన్‌పై పలువురు ఉద్యోగులు
శాఖలో ఉద్యోగులు తక్కువగా ఉన్నారని ప్రభుత్వానికి నివేదిక అందజేయడంతో ఇతర శాఖల్లోని కొంతమందిని దేవాదాయశాఖకు డిప్యూటేషన్‌పై పంపారు. అయితే, వారు తాత్కాలికం కావడంతో పనిపై అంతగా దృష్టి సారించడం లేదనే ఆరోపణలున్నాయి. శాఖలోని పై స్థాయి అధికారులు సైతం వారిపై ఒత్తిడి చేయలేని పరిస్థితి ఉందని, ఏదైనా సమాచారం అడిగినా నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. కార్యాలయం సమయానికి కూడా కొంతమంది ఉద్యోగులు రావడం లేదని, కొంతమంది మధ్యాహ్నం వరకు కూడా వస్తున్నారని, మళ్లీ పనిపూర్తి చేయకుండానే టైం అయిపోయిందంటూ వెళ్లిపోతున్నారనే ఆరోపణలున్నాయి. ఒక దేవాలయానికి సంబంధించిన అభివృద్ధిగానీ, ఇతరాత్ర పనులకు సంబంధించిన ఫైల్ కదలడానికి కొన్ని రోజులు పడుతుందనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఉద్యోగుల కొరత కూడా ఫైల్స్ పూర్తికాకపోవడానికి కారణమవుతోందని సమాచారం.
దేవాదాయశాఖలో ఖాళీల వివరాలు: