- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తెలంగాణలో ఆ పార్టీదే గెలుపు.. లోక్‌పోల్ సర్వేలో సంచలన ఫలితాలు..!
దిశ, తెలంగాణ బ్యూరో: మరో పది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరగనుండడంతో లోక్‌పోల్ సంస్థ నిర్వహించిన సర్వేలో కాంగ్రెస్ పార్టీకే విజయావకాశాలు మెండుగా ఉన్నట్లు వెల్లడైంది. గత కొన్ని రోజులుగా నియోజకవర్గాల్లో నిర్వహించిన సర్వే ఫలితాలను మంగళవారం సాయంత్రం వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్‌ను దాటి 69-72 సీట్లలో గెలిచే అవకాశముందని, అతి పెద్ద పార్టీగా అవతరించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశాలు మెండుగా ఉన్నట్లు పేర్కొన్నది. అధికార బీఆర్ఎస్ మాత్రం 40 కంటే ఎక్కువ సీట్లు పొందే అవకాశాలు లేవని పేర్కొన్నది. బీజేపీ 2-3 స్థానాల్లో, మజ్లిస్ 5-6 స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేసింది. ఇతర పార్టీల మద్దతు అవసరం లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలపై గణాంకాల రూపంలో క్లారిటీ ఇచ్చింది.
కాంగ్రెస్ పార్టీకి దాదాపు 43%-46% మేర ఓట్ల షేర్ వస్తుందని, బీఆర్ఎస్ పార్టీకి 38%-41% మధ్యలో ఉంటుందని పేర్కొన్నది. గత అసెంబ్లీ (2018లో) ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు 46.87% ఓట్ల షేర్ వస్తే ఈసారి అది తగ్గిపోనున్నది. కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో 28.43% ఓట్ల షేర్ మాత్రమే లభిస్తే ఈసారి గణనీయంగా పుంజుకుని 46% వరకు పెరుగుతుందని అంచనా వేసింది. బీజేపీ ఓట్ల శాతం గత ఎన్నికల తరహాలోనే 7% ఉంటుందని, మజ్లిస్‌కు 4% వరకూ వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నది. బీఆర్ఎస్‌కు, కాంగ్రెస్‌కు మధ్య కనీసంగా 4-5% మేర ఓట్ల షేరింగ్ వ్యత్యాసం ఉండొచ్చని అంచనా వేసింది. కాంగ్రెస్‌కు 80 సీట్లకు పైగానే ఉంటాయని పీసీసీ చీఫ్ రేవంత్ వెల్లడించగా లోక్‌పోల్ మాత్రం 70 దాటనున్నట్లు పేర్కొన్నది.
ఈ ఏడాది మే నెలలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గరిష్టంగా 134 స్థానాలు వస్తాయని లోక్‌పోల్ అంచనా వేసింది. అధికారంలో ఉన్నప్పటికీ బీజేపీ 65 సీట్లకే పరిమితమవుతుందని అంచనా వేసింది. ఆ అంచనాకు తగినట్లుగానే ఫలితాలు వెల్లడయ్యాయి. కర్ణాటక ఒపీనియన్ పోల్ ఫలితాలను వారం రోజుల ముందుగానే లోక్‌పోల్ వెల్లడించింది. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విషయంలోనూ పది రోజుల ముందుగానే అంచనా వేసింది. పోలింగ్ ఈ నెల 30న జరగనుండగా డిసెంబరు 3న జరిగే ఓట్ల లెక్కింపులో లోక్‌పోల్ అంచనా ఏ మేరకు నిజమవుతుందనేది తేలనున్నది.