హరితహారం మొక్కల విషయంలో దొంగ లెక్కలు..!

by Javid Pasha |
హరితహారం మొక్కల విషయంలో దొంగ లెక్కలు..!
X

దిశ, పరిగి: మున్సిపాలిటీ పరిధిలో హరితహారం అభాసుపాలవుతోంది. 2019 నుంచి 2022 వరకు నాలుగు సంవత్సరాల్లో లక్షా 87వేల 956మొక్కలు నాటినట్లు రికార్డులు చూపి రూ. 53,87,057 డ్రా చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయమై ‘దిశ’ దిన పత్రికలో మార్చి 28వ తేదీ కథనం ప్రచురించి అవినీతిని బయటపెట్టింది. కేవలం 303 మొక్కలు నాటితే రూ. 8 లక్షలు బిల్లులు పెట్టి, తప్పుడు లెక్కలు చూపించి డబ్బులు నొక్కేసినా అడిగే నాథుడే లేకపోయాడు. మున్సిపల్​ హరితహారంపై సంబంధిత శాఖ అధికారులు కనీసం ప్రశ్నించడకపోవడంపై ఈ అవినీతిలో అధికారులకు వాటా ఉందేమో అని అనుమానాలు వ్యక్తం అవుతున్నారు.

సంవత్సరాల వారిగా వార్డుల్లో నాటిన మొక్కల వివరాలు..

2019–20 నాటిన మొక్కలు 27,703.. ఖర్చు రూ. 8,83,374

పరిగి మున్సిపల్​ పరిధిలో 10వ వార్డులో అధికంగా 4500, 4వ వార్డులో 4300, 5వ వార్డులో అనంత్​ రెడ్డి నగర్ ఇళ్లలో పంపిణీ చేసినవి 3000, 4వ వార్డులో టీచర్స్​ కాలనీలో 1500, 12 వార్డులో 3000, 6వ వార్డులో 3000, 3వ వార్డులో 2500, 8 వార్డులో 2200, 2వ వార్డులో 2000, 7వ వార్డులో 1700, 1వ వార్డులో 1200 మొక్కలు నాటారు. వీటి నిర్వహణకు రూ. 8 లక్షల 83 వేల 374 వెచ్చించారు.

2020–21 సంవత్సరంలో 71,650 మొక్కలు, 27,69,094 లక్షలు

ఈ సంవత్సరంలో గమ్మత్తు ఏంటంటే కేవలం రెండు వార్డుల్లోనే 56,450 మొక్కలు నాటినట్లు రికార్డులు నమోదు చేయడం విశేషం. ఇందులో 4వ వార్డులో 33,350, 5వ వార్డులో 23,100 మొక్కలు నాటారు. మిగతా 13 వార్డుల్లో 15,200 మొక్కలు నాటారు. వీటి నిర్వహణకు రూ. 27 లక్షల 69 వేల 94 వెచ్చించారు.

2021–22 లో 41,453 మొక్కలు రూ. 12, 67,542 లక్షలు

పరిగి మున్సిపల్​‌లో 2021–22 సంవత్సరంలో 41,453 మొక్కలకు రూ. 12 లక్షల 67 వేల 542 ఖర్చు చేసినట్లు రికార్డులో నమోదు చేసి డబ్బులు డ్రా చేశారు. ఇందులో 10వ వార్డులో 9,650 మొక్కలు నాటగా ఎంవీఐ కార్యాలయం 2,500, అంగన్​ వాడీ వద్ద 1,000, 10 వార్డులో మైనార్టీ పాఠశాల వద్ద 1,200, 5 వార్డు మొత్తం 5,600 మొక్కలు నాటగా అనంత రెడ్డి నగరంలో 3 వేల, 5వ వార్డు వెంకటేశ్వర కాలనీలో 2,200, 5వ వార్డు తిరుమల వెంచర్​ 400, 6వ వార్డులో 3 వేలు, ఎర్రగడ్డపల్లిలో 1,650 , 8వ వార్డులో బోయవాడలో 900 , 12వ వార్డులో 3వేలు, 4వ వార్డులో 2800, 3వ వార్డులో 2500, 8వ వార్డులో 2200, 2వ వార్డులో 2000, 1వ వార్డులో మల్లెమోని గూడలో 1,600, మొక్కలు నాటి రూ. 12 లక్షల 67 వేల 542 డ్రా చేశారు.

2022–23లో 41,150 మొక్కలు రూ. 4,67,047 లక్షలు

మున్సిపల్​ లోని వివిధ వార్డుల్లో 41,150 మొక్కలు నాటి 4 లక్షల 67 వేల 47 వేల రూపాయలు ఖర్చు చేసినట్లు రికార్డుల్లో పొందుపరిచి డబ్బులు డ్రా చేసుకున్నారు. 2021–2022 సంవత్సరంలో ఈ సంవత్సరంలో కంటే 41,453 మొక్కలు నాటి రూ. 12,67,542 ఖర్చు చేసినట్లు అధిక మొత్తంలో డ్రా చేశారు. 2022–23 సంవత్సరంలో 41,150 మొక్కలు నాటితే రూ. 4 లక్షల 67 వేల 47 ఖర్చయితే ఏడాది క్రితం 41,453 మొక్కలు నాటిగా రూ. 12 లక్షల 67 వేల 542 ఖర్చు అయినట్లు రికార్డులు రాసి బిల్లులు డ్రా చేసుకున్నారు. కేవలం 303 మొక్కలే అధికం.. బిల్లులు మాత్రం ఏకంగా 8 లక్షలకుపైగా అధికం 2022–23 సంవత్సరంలో 41,150 మొక్కలు నాటి రూ. 4 లక్షల 67 వేల 047 ఖర్చు చేసినట్లు బిల్లులు పెట్టారు. అదే 41,453 మొక్కలు 2021–22 సంవత్సరంలో నాటితే 12 లక్షలకు పైగా బిల్లులు ఎందుకు చెల్లించాల్సి వచ్చిందనేది అర్థం కాని ప్రశ్నగా మగిలింది. కేవలం 303 ఎక్కువైతే రూ. 8,00,495 ఎందుకు ఎక్కువయ్యాయి.? అన్ని ప్రశ్నించే నాథుడే కరువయ్యాడంటూ మున్సిపల్​ ప్రజలు మండిపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed