- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Letter to CM : షరతులు లేకుండా రుణమాఫీ చేయండి.. సీఎంకు బాధిత రైతుల పేరుతో లేఖ
దిశ, డైనమిక్ బ్యూరో: రుణమాఫీ విషయంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అందువల్ల కుటుంబంలో కనీసం ఒకరికైనా రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతు సంఘం లేఖ రాసింది. రుణమాఫీ అవుతుందో లేదో అనే ఆందోళనతో కొంత మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు రెండు లక్షలకు పైగా లోన్లు ఉండి రుణమాఫీ కానీ బాధిత రైతుల పేరుతో రాసిన ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రభుత్వం ఇప్పటి వరకు కేవలం రెండు లక్షల లోపు ఉన్న రుణాలనే మాఫీ చేసిందని పేర్కొన్నారు. తమకు ఎందుకు రుణమాఫీ జరగడం లేదో తెలియక బ్యాంకులు, అధికారుల చుట్టూ గత నెల రోజులుగా తిరుగుతున్నారని కొంత మంది నిరాశలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కుటుంబంలో ఇద్దరు ముగ్గురికి రుణాలు ఉంటే అలాంటి వారి విషయంలో ఇంకా స్పష్టత లేదని, సరైన సమాచారం లేక తీవ్ర ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. రూ.రెండు లక్షల కంటే ఎక్కువ రుణాలు ఉన్నవారు రెండు లక్షలకు పై ఉన్న డబ్బులు కడితేనే మాఫీ అవుతుందనే సరికి దిక్కుతోచని స్థితిలో ఉన్నారని అందువల్ల ప్రతి కుటుంబంలో కనీసం ఒకరికైనా రెండు లక్షల వరకు రుణమాఫీ షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.