- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కీలక దశకు చేరుకున్న లిక్కర్ స్కాం కేసు విచారణ.. కేసీఆర్ కోసం కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్!
దిశ, డైనమిక్ బ్యూరో: 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీపై ఉమ్మడి పోరు కోసం విపక్ష పార్టీలు చేస్తున్న ప్రయత్నాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతున్నాయి. విపక్షాల కూటమికి కెప్టెన్‌గా తామే వ్యవహరిస్తామని గతంలో చెప్పిన కాంగ్రెస్ తాజా పరిణామాలతో ఓ మెట్టు దిగే ప్రయత్నం చేస్తోందా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే కేజ్రీవాల్, కేసీఆర్, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్‌ల వైఖరి కాంగ్రెస్ పక్షాన నిలిచిన మిగతా పార్టీలకు ఆందోళనకరంగా మారినట్లు చర్చ జరుగుతోంది. విపక్ష కూటమి ఏర్పాటు ఖాయమని చెబుతున్న మాట నిజమే అయినా ఆ కూటమి ఏ మేరకు ముందుకు సాగుతుందనేది ప్రశ్నార్థకంగానే మారింది. ఈ క్రమంలో నితీష్ కుమార్ చేస్తున్న తాజా ప్రయత్నం జాతీయ స్థాయిలో ఉత్కంఠ రేపుతున్నది. ఇప్పటికే కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశం అయిన నితీష్ కుమార్ తాజాగా కేసీఆర్, మమత బెనర్జీతో భేటీ కాబోతున్నారనే ప్రచారం జోరుగా వినిపిస్తున్నది.
కేసీఆర్‌తో నితీష్ ప్లానేంటి?:
నిజానికి గతంలో నితీష్ కుమార్‌కు కేసీఆర్‌కు మధ్య స్నేహం బాగానే నడిచింది. ఈ క్రమంలో ఓ సారి కేసీఆర్ స్వయంగా బిహార్ వెళ్లి అక్కడి రైతుల కుటుంబాలకు చెక్కులను సైతం పంపిణీ చేసి వచ్చారు. ఆ సయమంలో మీడియాపై నితీష్ కుమార్ కొంత అసహనం వ్యక్తం చేసినా కేసీఆర్ మాత్రం పట్టుబట్టి నితీశ్ కుమార్‌ను పక్కన కూర్చొబెట్టుకుని మరీ మీడియా సందేహాలను నివృత్తి చేశారు. ఏం జరిగిందో ఏమో కానీ అనూహ్యంగా ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు తనకు ఆహ్వానం లేదని నితీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఈ రెండు పార్టీల మధ్య గ్యాప్ వచ్చిందనే చర్చకు దారి తీసింది. అయితే విపక్షాల కూటమిలో కాంగ్రెస్ ఉండటాన్ని కేసీఆర్ సహించడం లేదని ఇదే సమయంలో బిహార్‌లో ఆర్జేడీ, కాంగ్రెస్ సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీష్‌తో దూరంగా ఉండటమే బెటర్ అనే అభిప్రాయానికి కేసీఆర్ వచ్చారా అనే సందేహాలు వ్యక్తం అయ్యారు. సీన్ కట్ చేస్తే తాజాగా విపక్షాల ఐక్యతను తన భుజాన వేసుకుంటానంటున్న నితీష్ కుమార్ ఈ క్రమంలో కేసీఆర్‌తో సమావేశం అయ్యేందుకు రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో కేసీఆర్ విషయంలో నితీష్ ప్లానేంటి అనేది ఆసక్తిగా మారింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు.. కేసీఆర్ దారెటు?
నిజానికి విపక్ష పార్టీలు ఎటువైపు ఉన్న కేసీఆర్, కేజ్రీవాల్ ఇద్దరు ఒకటిగా ఉంటారనే చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో గుప్పుమంటోంది. దీనికి కారణం ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు అనే టాక్ వినిపిస్తోంది. ఈ కేసు దర్యాప్తు ప్రస్తుతం కీలక దశకు చేరుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఓ వైపు విచారించగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను రేపు సీబీఐ ప్రశ్నించబోతోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్, కేజ్రీవాల్ కాంగ్రెస్ ఏర్పాటు చేయబోయే కూటమి వైపు మొగ్గు చూపుతారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో నితీష్ కుమార్ రాయబారం ద్వారా కాంగ్రెస్ చేసే రాజకీయం ఏ మేరకు ఫలిస్తుందో అనేది కాలమే సమాధానం చెప్పనుంది.
Read more: