- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో గ్రూపు-1 కొత్త నోటిఫికేషన్‌కు లైన్ క్లియర్
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో గ్రూపు-1 కొత్త నోటిఫికేషన్‌కు క్లియర్ అయింది. గత నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై గత ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. అయితే రాష్ట్రంలో తాజాగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కేసును ఉపసహించరించుకున్నది. దీంతో గ్రూపు-1 కొత్త నోటిఫికేషన్ వేసుకోవడానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు రాష్ట్రంలో గ్రూపు-1 పోస్టులను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. గతంలోని 503 ఖాళీలకు అదనంగా మరో 60 పోస్టులను పెంచుతూ ఇటీవల ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో మొత్తం ఖాళీల సంఖ్య 563 వరకూ ఉండే అవకాశం ఉంది. రాబోయే కొత్త నోటిఫికేషన్ పెంచిన పోస్టులతో కలిపి రానుంది. పేపర్ లీకేజీ, ప్రశ్నల తప్పిదాల కారణంగా పాత నోటిఫికేషన్‌ను రద్దు చేసి.. కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని నిర్ణయించారు. ఇదే అంశాన్ని తాజాగా అసెంబ్లీలో సైతం ప్రకటించారు.