బస్సులో పురుడు పోసిన మహిళా సిబ్బందికి సన్మానం!.. చిన్నారికి బర్త్ డే గిఫ్ట్ కింద లైఫ్ టైం ఫ్రీ బస్ పాస్

by Ramesh Goud |
బస్సులో పురుడు పోసిన మహిళా సిబ్బందికి సన్మానం!.. చిన్నారికి బర్త్ డే గిఫ్ట్ కింద లైఫ్ టైం ఫ్రీ బస్ పాస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బస్సులో పురుడుపోసిన మహిళా సిబ్బందికి టీజీఎస్ఆర్టీసీ సంస్థ తరుపున సన్మానించడం జరిగిందని, అలాగే చిన్నారికి జీవితకాలపు ఉచిత బస్ పాస్ అందిస్తున్నట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రకటించారు. హైదరాబాద్ బస్ భవన్ లో శనివారం ఉన్నతాధికారులతో కలిసి సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ బస్సులో గర్భిణికి పురుడుపోసి మానవత్వం చాటుకున్న సంస్థ సిబ్బందిని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం అభినందించిందని, బస్సులో జన్మించిన చిన్నారికి తమ బస్సుల్లో జీవిత కాలం ఉచితంగా ప్రయాణించేలా బస్ పాస్ ను అందిస్తున్నట్లు ప్రకటించారు.

ఆర్టీసీ బస్సులు, బస్ స్టేషన్ లలో పుట్టిన పిల్లలకు జీవిత కాలపు ఉచిత బస్ పాస్ ను ఇవ్వాలని గతంలో యాజమాన్యం తీసుకున్న నిర్ణయం మేరకు.. ఈ ఆడపిల్లకు బర్త్ డే గిప్ట్ గా లైఫ్ టైం ఫ్రీ బస్ పాస్ ను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. కాగా హైదరాబాద్ లోని ముషీరాబాద్ డిపోనకు చెందిన 1జెడ్ రూట్ బస్సులో శుక్రవారం ఉదయం శ్వేతా రత్నం అనే గర్భిణీ ఆరాంఘర్ లో ఎక్కారు. బహదూర్ పూర వద్దకు రాగానే ఆమెకు పురిటి నొప్పులు తీవ్రమయ్యాయి. ఈ విషయాన్ని గమనించిన కండక్టర్ ఆర్. సరోజ అప్రమత్తమై మహిళా ప్రయాణికుల సాయంతో సాధారణ ప్రసవం చేశారు. దీంతో ఆమె పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. డెలివరీ అనంతరం మెరుగైన వైద్యం కోసం బుస్సులోనే సమీపంలోని గవర్నమెంట్ మెటర్నటీ ఆస్పత్రికి తరలించారు.

తల్లిబిడ్డా క్షేమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. దీనిపై టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం స్పందిస్తూ.. సమయస్పూర్తితో స్పందించి, సకాలంలో కాన్పు చేసిన కండక్టర్ సరోజ, డ్రైవర్ ఎంఎం అలీ సేవలను టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రశంసించారు. వారు చాకచక్యంగా వ్యవహరించడంతోనే తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారని అన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో సంస్థ సీవోవో డాక్టర్ రవిందర్, జాయింట్ డైరెక్టర్ అపూర్వ రావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, కృష్ణకాంత్, హైదరాబాద్ ఆర్ఎం వరప్రసాద్, ముషీరాబాద్ డీఎం కిషన్, తదితరులు పాల్గొన్నారు. ఈ విషయాన్ని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్వయంగా తన ట్వట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు.

Advertisement

Next Story