- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
యోధుల పోరాటంతోనే తెలంగాణకు విముక్తి : ఈటల రాజేందర్
దిశ, వెబ్ డెస్క్ : కేంద్ర ప్రభుత్వం ఈనెల 17న పరేడ్ గ్రౌండ్స్(Pared grounds)లో నిర్వహిస్తున్న తెలంగాణ(Telangana) విమోచన దినోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్(Eatala Rajendar) పరిశీలించారు. సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ వేదికగా జరిగే ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని పేర్కొన్న ఈటెల రాజేందర్.. అక్కడ ఏర్పాటు చేసిన నిజాం పాలన నుంచి విముక్తి కోసం అమరులైన తెలంగాణ పోరాట యోధుల ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించారు. తెలంగాణ విముక్తి.. అనేక మంది పోరాట యోధుల ప్రాణత్యాగం వల్ల మాత్రమే సిద్ధించిదన్నారు. వారి త్యాగాల వలనే నిరంకుశ నిజాం పాలన నుంచి తెలంగాణ ప్రజలు స్వేచ్చా వాయువులు పీల్చుకున్నారని, అందుకే బీజేపీ(BJP) ప్రభుత్వం ఆరోజును తెలంగాణ విమోచన దినోత్సవం పేరుతో అధికారికంగా నిర్వహిస్తోందన్నారు. కాగా బీజేపీ చేస్తున్న ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రజల్లో మంచి స్పందన వస్తుందేమో అని భయపడి రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవం అంటూ దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చిన రోజుగా సెప్టెంబర్ 17ను భావించి ప్రతి ఒక్కరూ జెండా వందన కార్యక్రమానికి హాజరు కావాలని ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ ప్రజలకు పిలుపునిచ్చారు.