- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
SreeLeela: వ్యూస్ కోసం ఇంకొకరిని న్యూస్ చేయకండి.. నటి శ్రీలీల ఆసక్తికర వ్యాఖ్యలు (వీడియో)
దిశ, డైనమిక్ బ్యూరో: సామాజిక మాధ్యమాల్లో (social media) మంచి కోసం కంటే ఫేక్ కంటెంట్ వైరల్ అవుతోంది. ఇటీవల (Fake news, Deep fake) ఫేక్ న్యూస్, డీప్ ఫేక్ వీడియోలపై దేశవ్యాప్తంగా చర్చ జరిగిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో కొంత మంది ఇన్‌ఫ్లూయెన్సర్లు డబ్బులు, లైకులు, ఫాలోవర్స్, ఫేమస్ అవ్వడం కోసం తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారు. అలాంటి వారి మాటలు నమ్మి ఎంతో మంది మోసాలకు గురవుతున్నారు. వారిపై పోలీసులు యాక్షన్ తీసుకుంటున్న కూడా ఫేక్ న్యూస్ ప్రచారం మాత్రం ఆగడం లేదు.
ఫేక్ సమాచారం కట్టడి కోసం ప్రభుత్వాలు దృష్టి సారిస్తున్నాయి. సినీతారలు సైతం ఫేక్ న్యూస్‌పై అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే సోమావారం టాలివుడ్ నటి శ్రీలీల (SreeLeela) ఫేక్ న్యూస్‌పై ఓ అవగాహన వీడియో విడుదల చేశారు. ‘సోషల్ మీడియాలో లైక్స్, వ్యూస్, రీచ్ కోసం తప్పుడు వార్తలు ప్రచారం చేయకండి. షోషల్ మీడియాను మన మంచి కోసం వాడుదాం. వ్యూస్ కోసం ఇంకొకరిని న్యూస్ చేయకండి. అసత్య ప్రచారాలకు దూరంగా ఉందాం. సామాజిక బాధ్యత వహిద్దాం.. అంటూ నటి శ్రీలీల తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సోషల్ మీడియాను మన మంచి కోసం వాడుదాం అసత్య ప్రచారాలకు దూరంగా ఉందాం - శ్రీలీల@sreeleela14 #Sreeleela pic.twitter.com/I8TlesZ7Dj
— Team Sreeleela™️ (@Teamsreeleela) December 30, 2024