- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మూసీ, హైడ్రా బాధితులకు న్యాయ సహాయం : కేటీఆర్
దిశ, వెబ్ డెస్క్ : మూసీ, హైడ్రా బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఈ ప్రభుత్వంపై ప్రతిపక్షంగా ఓ వైపు పోరాటం చేస్తూనే..పేద ప్రజల తరఫున లీగల్ గానూ ఫైట్ చేస్తామన్నారు. హైడ్రా, మూసీ బాధితులకు లీగల్ గా సాయం చేసేందుకు తెలంగాణ భవన్ లో లాయర్ల బృందం ఉంటుందని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ భవన్ కు వచ్చిన బాధితులతో కేటీఆర్ మాట్లాడారు. ప్రభుత్వం చేస్తున్న మూర్ఖపు చర్యలకు ఎవరు భయపడాల్సిన అవసరం లేదన్నారు. పేదల ఇళ్లు ఒక్కటి కూడా కూల్చనివ్వమని చెప్పారు. బాధితులకు బీఆర్ఎస్ లీగల్ టీమ్ అందుబాటులో ఉంటుందన్నారు. అన్ని పర్మిషన్లు ఇచ్చి ప్రజల దగ్గర నుంచి ట్యాక్స్ వసూలు చేసి ఇప్పుడు వాళ్ల ఇళ్లు కూల్చటమనేది దుర్మార్గమని చెప్పారు.
ఈ సందర్భంగా బాధితులు కేటీఆర్ కు తమ గోడును చెప్పుకున్నారు. అన్ని పర్మిషన్లు ఉన్నా కూడా ప్రభుత్వం తమను ఇబ్బంది పెడుతోందని, కేసీఆర్ హయాంలో పేద ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూశారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమను ఆదుకుంటుందనుకుంటే ఇళ్లను కూలగొడుతుండటం ఆవేదన కలిగిస్తోందని కేటీఆర్ తో ఆవేదన పంచుకున్నారు. ప్రతి ఒక్కరికీ బీఆర్ఎస్ అండగా ఉంటుందని వారికి కేటీఆర్ వారికి ధైర్యం చెప్పారు. న్యాయపరంగా వారి తరఫున బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని భరోసా ఇచ్చారు.