అధికార దాహంతోనే లీకేజీలు : మంత్రి కొప్పుల

by Sathputhe Rajesh |   ( Updated:2023-04-05 07:39:47.0  )
అధికార దాహంతోనే లీకేజీలు : మంత్రి  కొప్పుల
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ అవలంబిస్తున్న పద్ధతులు గతంలో ఎన్నడూ చూడలేదని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బీజేపీ అధికార దాహంతో ఉందన్నారు. దాని కోసం ఎంత నీచానికైనా దిగజారుతున్నారని మంత్రి కొప్పుల ఫైర్ అయ్యారు. టెన్త్ ప్రశ్నాపత్రం లీకేజీ, బండి అరెస్ట్ వ్యవహారంపై ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో జరిగిన పేపర్ లీకేజీలు, ఇప్పుడు పేపర్ బయటకు రావడం ఉద్దేశ పూర్వకంగా చేస్తున్నారని మండి పడ్డారు. ప్రశాంత్ బీజేపీ కార్యకర్త అన్నారు. దీంట్లో బండి సంజయ్ ప్రమేయం ఉన్నట్లు స్పష్టమవుతోందన్నారు. దీన్ని తెలంగాణ ప్రజానీకం ఖండించాలన్నారు. ప్రజావ్యతిరేక చర్యలు చేస్తున్న బండి సంజయ్‌ను వెంటనే అరెస్ట్ చెయ్యాలని డిమాండ్ చేశారు.

Read more:

పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్ సూత్రధారి బండి సంజయ్: మంత్రి వేముల

Advertisement

Next Story