- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Lavanya: త్వరలోనే అన్ని ఓపెన్‌గా చెప్తా! నార్సింగి స్టేషన్‌కు లావణ్య

దిశ, డైనమిక్ బ్యూరో: నటుడు రాజ్‌తరుణ్(Raj Tarun) -లావణ్య (Lavanya) కేసు మరోసారి తెరపైకి వచ్చింది. లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు (Narsingi Police Station) నార్సింగ్ పోలీసులు మస్తాన్ సాయిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. నటుడు రాజ్ తరుణ్ తనతో విడిపోవడానికి (Mastan Sai) మస్తాన్ సాయి కారణమని లావణ్య ఫిర్యాదులో పేర్కొన్నారు. పలువురు అమ్మాయిల ప్రైవేటు వీడియోలు చిత్రీకరించినట్లు మస్తాన్ సాయిపై ఆరోపణలు ఉన్నాయి. అతడి హార్డ్ డిస్క్‌లో 200కి పైగా వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే లావణ్య సోమవారం నార్సింగ్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ఆమె స్టేట్ మెంట్‌ను పోలీసులు తీసుకున్నారు.
ఈ క్రమంలోనే ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రెండేళ్ల నుంచి ఈ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపణలు చేశారు. మస్తాన్ అమ్మాయిల అశ్లీల వీడియోలు రికార్డు చేస్తుంటాడు.. గతంలో నా దగ్గర ఆధారాలు లేవు.. ఇప్పుడు ఆధారాలన్నీ పోలీసులకు అందించా అని లావణ్య చెప్పారు. అదేవిధంగా త్వరలో అన్ని విషయాలు ఓపెన్ చేప్తానని హాట్ కామెంట్స్ చేశారు.