దేశవ్యాప్తంగా సంబరాలు.. హైదరాబాద్‌లో మాత్రం భారత క్రికెట్ అభిమానుల పై లాఠీ ఛార్జ్

by Mahesh |   ( Updated:2025-03-10 13:10:00.0  )
దేశవ్యాప్తంగా సంబరాలు.. హైదరాబాద్‌లో మాత్రం భారత క్రికెట్ అభిమానుల పై లాఠీ ఛార్జ్
X

దిశ, వెబ్ డెస్క్: దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ (ICC Champions Trophy final match) లో భారత్ విజయం (India win) సాధించి ఛాంపియన్స్‌గా నిలిచింది. దీంతో భారత క్రికెట్ అభిమానులు (Indian cricket fans) దేశవ్యాప్తంగా సంబరాలు (Celebrations across the country) జరుపుకున్నారు. దాదాపు 12 సంవత్సరాల తర్వాత భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడంతో క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు అయింది. దీంతో భారత విజయాన్ని సెలబ్రేట్ (Celebrations) చేసుకునేందుకు చిన్నాపెద్ద తేడా లేకుండా వేలాది మంది యువకులు రోడ్డుపైకి వచ్చారు. దేశవ్యాప్తంగా ఇదే రీతిలో సంబరాలు జరిగాయి.

కానీ హైదరాబాద్ నగరంలో మాత్రం ఇందుకు భిన్నంగా భారత అభిమానుల పై పోలీసులు లాఠీ ఛార్జ్ (Police lathi charge Indian fans) చేశారు. గ్రూప్స్, పోలీస్ కోచింగ్ సెంటర్లు అత్యధికంగా ఉండే దిల్‌షుక్‌నగర్ (Dilsukhnagar) లో భారత విజయం తర్వాత పెద్ద ఎత్తున యువకులు రోడ్డుపైకి వచ్చి కేరింతలు కొడుతూ.. భారత్ మాతాకీ జై అనే నినాదాలు చేస్తూ.. సంబరాలు జరుపుకున్నారు. అయితే ఒకేసారి వందలాది మంది యువకులు రోడ్డు పైకి రావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ఆగ్రహించిన స్థానిక పోలీసులు సంబరాలు చేసుకుంటున్న యువకులపై లాఠీ ఛార్జ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. పోలీసులు తీరుపై నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

కాగా భారత అభిమానులపై పోలీసుల లాఠీ ఛార్జ్ పై తెలంగాణ బీజేపీ ఫైర్ (BJP fire) అయింది. ఈ సందర్భంగా ఆ పార్టీ అధికారిక ఎక్స్(Twitter) ఖాతాలో " దిల్‌సుఖ్‌నగర్‌లో భారత ఛాంపియన్స్ ట్రోఫీ విజయాన్ని జరుపుకుంటున్న ప్రజలు, యువకులపై లాఠీచార్జి చేసిన కాంగ్రెస్ పోలీస్‌లు. ఇది కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కొత్త విధానమా? ఇలాంటివి ఎవరి మన్ననను పొందేందుకు చేస్తున్నారు? భారతదేశ విజయాన్ని భారతీయులు ఎక్కడ జరుపుకోవాలి?" అని ప్రశ్నించింది. అయితే ఒక్కసారిగా రోడ్డు మీదకు వచ్చిన వందలాది మంది యువకులు సెలబ్రేషన్స్ పేరుతో స్థానిక మెట్రో, బస్టాండ్ సమీపంలోని ప్రయాణికులకు ఇబ్బంది కలిగించడంతో.. వారిని చెదరగొట్టేందుకు లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చినట్లు పోలీసులు తెలుపుతున్నారు.

Next Story

Most Viewed