ఈడీ కస్టడీలో సాహితీ ఇన్‌ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణ

by karthikeya |
ఈడీ కస్టడీలో సాహితీ ఇన్‌ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణ
X

దిశ, వెబ్‌డెస్క్: రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో వేలాది మందిని మోసం చేసిన సాహితీ ఇన్‌ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణ (Laksmi narayana)ను ఈడీ అధికారులు ఈ రోజు (సోమవారం) అదుపులోకి తీసుకున్నారు. రూ.1500 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిన సాహితీ ఇన్ ఫ్రా (Sahiti Infra) ఎండీపై గతంలో కేసు నమోదుచేసిన హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సంస్థ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి, ఆస్తులను అటాచ్‌ చేసినట్లు సీసీఎస్‌ పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే ఈ సంస్థపై 50కి పైగా కేసులు నమోదు కాగా.. దాదాపు 3 వేల మంది వరకు బాధితులు ఉన్నారు. ప్రీ లాంచ్‌ ఆఫర్‌ పేరుతో హైదరాబాద్‌లో వీరి నుంచి కోట్ల రూపాయల వసూళ్లు జరిపినట్లు పోలీసులు చెబుతున్నారు. కాగా.. బాధితుల ఫిర్యాదుతో హైదరాబాద్ సీసీఎస్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు నేపథ్యంలో రూ.200 కోట్ల సాహితీ ఇన్‌ఫ్రా ఆస్తులను అటాచ్ చేసినట్లు సీసీఎస్ పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే కోట్లలో మోసం జరగడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కూడా రంగంలోకి దిగి విచారణ ప్రారంభించింది. కేసు దర్యాప్తులో భాగంగా తాజాగా లక్ష్మీనారాయణను అరెస్ట్ చేసిన ఈడీ.. ఆయనను తమ కార్యాలయానికి తీసుకొచ్చి విచారిస్తోంది. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టనుంది.

Advertisement

Next Story

Most Viewed