లక్షల కోట్ల ప్రజాధనాన్ని కాపాడాలి.. ఏఐసీసీ సభ్యుడు బక్క జడ్సన్

by samatah |   ( Updated:2022-11-28 15:50:04.0  )
లక్షల కోట్ల ప్రజాధనాన్ని కాపాడాలి.. ఏఐసీసీ సభ్యుడు బక్క జడ్సన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థల అక్రమ బ్యాంకు రుణాలపై చర్యలు తీసుకోవాలని ఏఐసీసీ సభ్యుడు బక్క జడ్సన్ కేంద్ర సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఏజేన్సీని కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన ప్రభుత్వ చర్యలపై కేంద్ర సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఏజేన్సీకి ఫిర్యాదు చేశారు. స్టేట్ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీ బాండ్ల ద్వారా కాలానుగుణ అవసరాల ప్రకారం రూ. 45000 కోట్ల రుణాన్ని పొందిందని, అయితే ఆ హామీలు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ వాల్యూమ్‌లో నమోదు చేయబడలేదని ఆరోపించారు.

రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ 2014 నుంచి ప్రభుత్వం ఆడిట్ చేయలేదని తెలిపారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ అయిన ఒక నీటిపారుదల ప్రాజెక్ట్‌లో లక్షల కోట్ల రుణాలు వివిధ బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సంస్థల నుంచి రూ. 97,449.16 కోట్ల రుణాన్ని పొందిందని సమర్పించామని చెప్పారు. ఈ ప్రాజెక్ట్‌లో ఆమోదం పొందని భాగానికి లక్షల కోట్ల రుణాన్ని మంజూరు చేసిందన్నారు. ప్రాజెక్టులో అనేక ఇతర అక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అందువల్ల రాష్ట్రంలోని అన్ని చట్టబద్ధమైన, ప్రభుత్వ రంగ సంస్థలపై ప్రత్యేక ఆడిట్ చేసి, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, బ్యాంకు అధికారులు, ఆర్థిక సంస్థల అధికారులపై అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అభ్యర్థించారు. లక్షల కోట్ల ప్రజాధనానికి సంబంధించి ప్రజల సొమ్మును కాపాడాలని ఏజెన్సీని బక్కజడ్సన్ కోరారు.

Advertisement

Next Story

Most Viewed