MP Chamala : లగచర్ల దాడి ఘటన బీఆర్ఎస్ ప్రేరేపితమే : ఎంపీ చామల

by Y. Venkata Narasimha Reddy |
MP Chamala : లగచర్ల దాడి ఘటన బీఆర్ఎస్ ప్రేరేపితమే : ఎంపీ చామల
X

దిశ, వెబ్ డెస్క్: వికారాబాద్ జిల్లా కలెక్టర్‌( Vikarabad District Collector)కారుపైన, అధికారులపైన కొడంగల్ నియోజకవర్గం దుగ్యాల మండలం లగచర్ల(Lagacharla attack) గ్రామంలో జరిగిన రాళ్ల దాడి బీఆర్ఎస్ పార్టీ ప్రేరేపితమని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి(MP Chamala Kirankumar Reddy)ఆరోపించారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఉన్న చామల కలెక్టర్ పైన, అధికారులపైన జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ వీడియో విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని అడ్డుకోవడానికి బీఆర్‌ఎస్ నాయకులే ఈ దారుణానికి పాల్పడ్డారని ఆరోపించారు. పారిశ్రామికీకరణ, అభివృద్ధికి సంబంధించి చేపట్టిన భూసేకరన, ప్రజాభిప్రాయ సేకరణ వంటి ప్రభుత్వ చర్యలను అడ్డుకున్న ఘటనలలో ఎప్పుడు కూడా ఇలాంటి హింస జరగలేదన్నారు. ఫార్మా కంపనీ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణను హింసాత్మకంగా మారడం వెనుక బీఆర్ఎస్ కుట్ర ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఇలాంటి ఘటనలకు బీఆర్ఎస్ పాల్పడటం ద్వారా ప్రజాస్వామ్యానికి సవాల్ విసిరారన్నారు. కొడంగల్ అభివృద్ధి కోసం సీఎం చేపట్టిన అభివృద్ధిని అడ్డుకోవాలనుకున్న బీఆర్‌ఎస్ ఉద్దేశం ఏంటో ప్రజలు అర్థం చేసుకోవాలని చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరారు,.

Advertisement

Next Story