- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Kunamneni: స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీకి ఇబ్బందులు తప్పవు.. ఎమ్మెల్యే కూనంనేని షాకింగ్ కామెంట్స్

దిశ, వెబ్‌డెస్క్: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ (Congress) పార్టీకి ఇబ్బందులు తప్పవని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (MLA Kunamneni Sambasiva Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు నెరవేర్చలేకపోయిందని కామెంట్ చేశారు. దీంతో ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం సన్నగిల్లుతోందని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలపై వెంటనే శ్వేతపత్రం (White Paper) విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హామీలపై కాంగ్రెస్ పార్టీ (Congress Party) వివరణ ఇచ్చిన తరువాతే స్థానిక ఎన్నికలకు వెళితే బాగుంటుందని సీపీఐ తరఫున హస్తం పార్టీకి సూచిస్తున్నామని అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బలంగా ఉన్న చోటే తాము పోటీ చేస్తామని.. మిగతా చోట్ల కాంగ్రెస్ పార్టీని కలుపుకుపోతామని కూనంనేని తెలిపారు. అదేవిధంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ (Graduate MLC) ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ఇస్తున్నామని స్పష్టం చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీల (Teachers MLCs) అభ్యర్థుల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే దానిపై పార్టీలో చర్చలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ (Classification of SC), బీసీ కులగణన (BC Cast Census) చేయడాన్ని తమ పార్టీ స్వాగతిస్తోందని అన్నారు. మావోయిస్టులను ఎన్‌కౌంటర్ల (Encounter) పేరుతో అత్యంత దారుణంగా చంపేస్తున్నారని.. ఆ అంశంపై ప్రభుత్వం న్యాయ విచారణ జరిపించాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (MLA Kunamneni Sambasiva Rao) డిమాండ్ చేశారు.