మా వైపు నుంచి సంపూర్ణ సహకారం అందిస్తాం.. ప్రభుత్వానికి కేటీఆర్ సూచన

by Gantepaka Srikanth |
మా వైపు నుంచి సంపూర్ణ సహకారం అందిస్తాం.. ప్రభుత్వానికి కేటీఆర్ సూచన
X

దిశ, వెబ్‌డెస్క్: వచ్చే బడ్జెట్ సమావేశాలు కనీసం 20 రోజులైనా పెట్టాలని ప్రభుత్వానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. మంగళవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. తమ వైపు నుంచి ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందిస్తామని అన్నారు. ఎక్కువ రోజులు సభ నిర్వహిస్తే సమాధానం ఇచ్చేందుకు మంత్రులకు అధిక సమయం దొరుకుతుందని చెప్పారు. ఒకేరోజు 19 ప‌ద్దుల‌పై చ‌ర్చ జ‌రిపి అప్రూవ్ చేసుకోవాల‌నే ఉద్దేశంతో మంగ‌ళ‌వారం తెల్లవారుజామున‌ 3 గంట‌ల వ‌ర‌కు స‌భ‌ను న‌డిపారు. సుదీర్ఘ ప్రసంగాలు చేయొద్దన్న మంత్రి శ్రీధర్ బాబు ప్రతిపాద‌న‌ను అంగీక‌రిస్తున్నాము. కానీ ఈ స‌భ‌లో 57 మంది కొత్త స‌భ్యులు ఉన్నారు.. వారంద‌రూ మాట్లాడాల‌ని అనుకుంటున్నారు. ఈ స‌మావేశాలు అయిపోయాయి. కానీ వ‌చ్చే అసెంబ్లీ, బ‌డ్జెట్ స‌మావేశాలు అయినా కనీసం 20 రోజులు పెట్టాలని రిక్వెస్ట్ చేశారు.

Advertisement

Next Story