- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కవిత బెయిల్‌పై బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు.. ఘాటుగా స్పందించిన కేటీఆర్
దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయటంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ వివాదస్పద వ్యాఖ్యలు చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయటం కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల విజయమంటూ బండి సంజయ్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ లాయర్ చేసిన కృషితో ఒకరికి బెయిల్ వస్తే.. బీఆర్ఎస్ సపోర్ట్ కారణంగా ఆ లాయర్ రాజ్యసభలో స్థానం పొందారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఎమ్మెల్సీ కవిత బెయిల్ కోసం వాదనలు వినిపించిన లాయర్‌కు కాంగ్రెస్ తరఫున రాజ్యసభ సీటు వచ్చేలా కేసీఆర్ రాజకీయ చతురత ప్రదర్శించారంటూ ఆయన చేసిన పోస్ట్‌లో కామెంట్స్ చేశారు. వైన్ అండ్ డైన్ క్రైమ్‌లో పార్టనర్స్ అయిన కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు కంగ్రాట్స్ అంటూ ఆయన స్థాయిని మరిచి సుప్రీంకోర్టు తీర్పును అపహస్యం చేసేలా బండి సంబయ్ కామెంట్స్ చేశారని కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. బండి సంజయ్ ట్వీట్‌కు స్పందిస్తూ.. కేంద్రమంత్రిగా ఉంటూ ఇంత చౌకబారుగా మాట్లాడతారా? అని విమర్శించారు. ఇలా దురుద్దేశపూర్వకంగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను కోర్టు ధిక్కారంగా పరిగణించాలంటూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.