రెడీగా ఉండండి.. ఉప ఎన్నికలు రాబోతున్నయ్: KTR సంచలన ప్రకటన

by Gantepaka Srikanth |
రెడీగా ఉండండి.. ఉప ఎన్నికలు రాబోతున్నయ్: KTR సంచలన ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: గాంధీ భవన్(Gandhi Bhavan) వేదికగా శుక్రవారం జరిగిన కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. నేతలంతా మంచి ఉంటే బహిరంగంగా చెప్పాలి.. చెడు ఉంటే చెవిలో చెప్పాలి.. కానీ దీనికి అందరూ భిన్నంగా చెడును మైకుల్లో చెబుతున్నారు.. మంచిని చెవిలో చెబుతున్నారని సొంత నేతలపై మండిపడ్డారు. ఇక నుంచి ఎవరూ అలా ప్రవర్తించకూడదని అన్నారు. తాజాగా.. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) స్పందించారు. శనివారం తెలంగాణ భ‌వ‌న్‌లో కేటీఆర్ సమక్షంలో రంగారెడ్డి జిల్లాకు చెందిన ప‌లువురు కాంగ్రెస్ నాయ‌కులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి కేటీఆర్ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అతి త్వరలో రాష్ట్రంలో ఉప ఎన్నికలు(By-Elections) రాబోతున్నాయని సంచలన ప్రకటన చేశారు.

దీనికి బీఆర్ఎస్(BRS) శ్రేణులంతా సిద్ధంగా ఉండాలని సూచించారు. మంచి మైక్ లో చెప్పాలి.. చెడు చెవిలో చెప్పాలి అని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. మంచి చెప్పడానికి రేవంత్ రెడ్డి చేసిన ఒక్క మంచి పని లేదు.. రేవంత్ రెడ్డి చేసిన చెడు చెబితే.. చెవిలో రక్తాలు కారుతాయి అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చి 15 నెలలు దాటినా చెప్పుకోవడానికి ఒక్క మంచి పని కూడా లేదంటే ప్రజలే అర్థం చేసుకోవాలని అన్నారు. అన్ని వర్గాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేధిస్తోందని అన్నారు. మహిళలు, విద్యార్థులు, రైతులు, నిరుద్యోగులు ఇలా చెప్పుకుంటూ పోతే అందరినీ ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు.

Next Story

Most Viewed